ఈ దేశం ఎమయ్యిపోతే నాకేంటి, ఈ గడ్డపైన పుట్టినంత మాత్రాన ఇక్కడే ఉండాలా, నా టాలెంట్ కి కోట్లు వచ్చి పడుతాయి, భారత్ లో అలాంటి అవకాశం లేదు అంటూ తల్లిలాంటి భారతావని విడిచి విదేశాలకి ఎంతో మంది వెళ్ళిపోతారు, అక్కడే స్థిరపడిపోతారు. ఎవరి ఇష్టం వారిదే..ఎవరి భవిష్యత్తు వారిదే కానీ ఓ యువకుడు అందుకు భిన్నంగా ఆలోచించాడు, ప్రపంచాన్ని శాసించే అమెరికా, అమెరికాకే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, అగ్ర రాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఇలా ఎంతమంది తమ దేశానికి రమ్మని ఆహ్వానించినా అన్ని అవకాశాలని కాలదన్నాడు..నా సేవలు భారత్ కే అంకితం అంటూ తేల్చి చెప్పాడు.

Image result for gopal g bihar

 

బీహార్ రాష్ట్రం భాగల్పూర్ జిల్లా ద్రువ్గంజ్ కి చెందినా గోపాల్ అనే 19 ఏళ్ళ యువకుడు నిరుపేద కుటుంభానికి చెందినా వాడు. అతడి చదువు మొత్తం ప్రభుత్వ పాటశాలలోనే జరిగింది. అతడి మేధో శక్తి ముందు పేదరికం కనపడలేదు. అతడికి ఉన్న అపారమైన విద్యా తెలివితేటలు అతడిని ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ప్రస్తుత సమాజంలో నిలబెట్టాయి. చిన్నతనం నుంచే చదువులో రాణించి టీచర్స్ నే  లెక్కలు చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఆట పాటల వయసులోనే రెండు అద్భుతమైన ఆవిష్కరణలు చేసి అందరిని నోళ్ళు వెళ్ళబెట్టేలా చేశాడు.

Image result for gopal g bihar

అతడు చేసిన రెండు ప్రయోగాలు అరటి తో మరియు పేపర్ బయో సెల్స్ కు పేటెంట్లు కూడా సాధించాడు. పదో తరగతిలో ఉండాగానే  అత్యున్నతమైన ఇన్స్పైర్ అవార్డ్ పొందాడు.ఆ తరువా అహ్మదాబాద్ లో నేషనల్ ఇన్నోవేషన్ సంస్థ  సహకారంతో మరో నాలుగు అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. దాంతో గోపాల్ లో ప్రతిభని గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు గోపాల్ కి రెడ్ కార్పెట్ పరిచారు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు అమెరికా రమ్మని ఆహ్వానించినా సరే కుదరదని చెప్పేశాడు. ఉన్నంత వరకూ భారత అభివృద్దికి కృషి చేస్తానని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం గోపాల్ మోటివేషన్ స్పీకర్ గా education ECOSYSTEM' target='_blank' title='డిజిటల్ ఎడ్యుకేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డిజిటల్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా విద్యార్ధుల్లో స్పూర్తిని నింపుతున్నాడు. ఇలాంటి స్పూర్తి ఎంతోమంది యువకులలో ఉందొ తెలియదు కానీ గోపాల్ ని చూసి ఎంతోమంది భవిష్యత్తులో స్పూర్తి పొందాలని ఆశిద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: