నేటి మంచి మాట.. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు మరొకటి లేదు.. అవును... ఇది ఎవరు చెప్పారో కానీ.. మహానుభావుడు. నిజంగా ఇది మన వ్యక్తిత్వాన్ని తలా దించే పని చేసే సోమరితనం. సోమరితనం వల్ల మనం ఎంత వరస్ట్ అవుతాం అంటే అది ప్రత్యేకంగా చెప్పకూడదు లెండి.. అంత సోమరులు అవుతాం మనం. 

 

మనిషి అన్నవాడు చురుకుగా ఉంటేనే.. ఎవరిపైన ఢిపెండ్ కానట్టు.. లేదు అంటే సోమరిపోతులం అవ్వక తప్పదు.. ఇప్పుడు ఉదాహరణకు.. నీకు ఒక జాబ్ ఉంది.. అలాగే ఒక ఫ్రీలాన్స్ జాబు ఉంది. నీ పర్మనెంట్ జాబ్ కంటే కూడా ఫ్రీలాన్స్ జాబ్ ఏ సమయానికి జీతం ఇస్తుంది.. నిన్ను కాపాడుతుంది. 

 

దీంతో ఉన్న జాబ్ పై విరక్తి పుట్టి ఉన్న జాబ్ ని మానేసి ఏదో సాధిద్దాం అని ఫ్రీలాన్స్ చెయ్యడానికి ఇంట్లోనే కుర్చున్నావ్.. అలాంటప్పుడు ఫ్రీలాన్స్ అయినా చక్కగా చేసుకోవాలా? మంచి పని చూసుకోవాలా? కానీ నువ్వు తినడానికి.. నిద్రపోవడానికి సమయం కేటాయిస్తావ్ తప్ప ఫ్రీలాన్స్ వర్క్ చేసుకోవు.. దాని వల్ల ఎవరికీ నష్టం? ఇప్పుడు ఏం నష్టం లేదు.. భవిష్యేత్తులో నష్టం.. అంటే నెలాఖరులో ఈఎంఐ.. హాస్టల్ ఫీ.. చిట్టిల్లు.. ఇంటికి పంపించేటప్పుడు తిట్టుకుంటావ్.. ఎంత తిట్టుకుంటే ఏం ప్రయోజనం ? ఎలాగో ఉపయోగం లేదు కదా.. ఇంతకంటే బద్ద శత్రువు ఎవరైనా ఉంటారా?  

మరింత సమాచారం తెలుసుకోండి: