ప్రస్తుత ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమకు రోజులు లేవు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భార్యాభర్తల మధ్య అయినా గాని తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అయినా గాని కుటుంబపరంగా అయినా గాని వ్యక్తిగతంగా అయినా ప్రేమ అనేది కనబడటం లేదు. చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవటం ఇటువంటి సంఘటనలు మనం తెల్లవారితే చూస్తూనే ఉన్నాం.

 

ముఖ్యంగా యువతీ యువకుల మధ్య చూసుకుంటే కాలేజీ వయసు రాకముందే స్కూల్ వయసులోనే అట్రాక్షన్ వయసులోనే ప్రేమ అనుకొని తమని తాము మోసం చేసుకుంటూ చిన్న వయసులోనే జీవితాలను చదువును పాడు చేసుకుంటున్నారు. డేటింగ్ పేరిట కలుస్తూ పెళ్లి కాకముందే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు. దానికి ప్రేమ అని టైటిల్ పెడుతున్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఆన్లైన్ అంత అయిపోవడంతో ఫేస్బుక్ లో ఇంకా సోషల్ మీడియాలో ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగితేలుతూ ఫోన్ లో సోషల్ మీడియాలో ఎదుటి వారిపై బతుకు చూసి తమని తాము మోసం చేసుకుంటూ ప్రేమలో పడుతున్నారు.

 

ప్రేమ పేరిట తమ శరీర కోరికలు తీర్చుకుంటూ కొన్నిసార్లు అదే ప్రేమ పేరిట డబ్బులు కూడా సంపాదిస్తున్న యువతులు మరియు యువకులు కూడా ప్రస్తుత ప్రపంచంలో ఉన్న దాఖలాలు ఉన్నాయి. నిజంగా డేటింగ్ యుగం లో ఉన్న మనకి స్వచ్ఛమైన ప్రేమ అనేది అరుదుగా దొరుకుతుంది. స్వచ్ఛమైన ప్రేమ కావాలంటే ప్రస్తుత రోజుల్లో ఒకప్పుడు గ్రామాల్లో ఉండేది కానీ పోను పోను గ్రామాల్లో కూడా టెక్నాలజీ పెరిగిపోవడంతో స్వచ్ఛమైన ప్రేమ కూడా చచ్చిపోయింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: