ఒకరి కింద పని చేయడమా.. ఇంకో నలుగురికి ఉపాధి చూపించడమా.. ఏది కరెక్ట్ అంటే చెప్పడం కష్టమే. కానీ అవకాశం ఉంటే.. సాధ్యమైతే.. స్వయం ఉపాధే సరైంది. మన కాళ్లపై మనం నిలబడటం ఎప్పుడూ బావుంటుంది. ఇక మహిళలకైతే.. ఏదో ఒక స్వయం ఉపాధి మెరుగైంది.

 

ఎందుకంటే.. అవసరం కోసం ఉద్యోగాలు చేసే మహిళలు.. పనిలో సంతృప్తి గురించి ఆలోచించరు. యాంత్రికంగా పనిచేస్తూ ఒత్తిడికి గురవుతారు. దీనికి బదులుగా అలవాట్లు, అభిరుచులనే వ్యాపార మార్గాలుగా ఎంచుకొని విజయం సాధించవచ్చు. పెద్ద కుటుంబాలు తగ్గిపోతున్న తరుణంలో మహిళలకు ఇంటిపనులు, కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం వంటివి సవాళ్లుగా మారుతున్నాయి.

 

ఇంట్లో ఇల్లాలికి బాధ్యతలెక్కువ. పిల్లలకు ఏదైనా జబ్బుచేస్తే ఒక్కరోజు కార్యాలయానికి సెలవు పెట్టడానికి ఎన్నో అనుమతులు తీసుకోవాలి. అదే సొంతంగా చిన్నపాటి వ్యాపారం పెట్టుకుంటే ఆ ఇబ్బందులు ఉండువు. ఆఫీసుల్లో ఉండే ఒత్తిడి, రోజువారీ లక్ష్యాలు వంటివి ఉండవు.

 

మనకోసమే మన పని అనే ఆలోచన మనసులో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా ఇష్టంగానే స్వీకరిస్తాం. వందశాతం ఆత్మసంతృప్తి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలనూ చక్కబెట్టుకోవచ్చు. మీరు నేర్చుకునే కళ మీ సొంతమైతే అది మీకు నలుగురిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఇదీ అసలు విషయం.. ఇక ఆపై మీ ఇష్టం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: