కోవిడ్‌- 19(కరోనా వైరస్‌).. ఈ పేరు వింటేనే వ‌ణుకు తెప్పిస్తుంది. చైనాలో వ్యాపించిన ఆ మహమ్మారి ఎక్కడ తమకు అంటుకుపోతుందో అని ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఈ వైర‌స్ వ‌ల్ల‌ రోజుకు వందలాది మంది మృతి చెందుతున్నారు. వేల సంఖ్యలో వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ వ్యాధి వ్యాప్తి నెమ్మదించే సూచనలు కనపించట్లేదు.  భారత్ పాటు మరో 20 దేశాలకు కరోనా వైరస్ విస్తరిస్తోంది. కరోనా వైరస్ కారణంగా చైనాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. 

 

ఆ తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చలికాలంలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో వైరస్‌ వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ పౌరులను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఉత్తర కొరియా మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. ఉత్తర కొరియా.. ఈ పేరు వింటే ఆ దేశ అధ్యక్షడు కిమ్ జోంగ్ ఉన్ గుర్తుకు వస్తారు. అక్కడి కఠినాతికఠిన నిబంధనలు మదిలో మెదులుతాయి. అయితే తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 విషయంలో ఆ దేశం చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. 

 

కరోనా వైరస్‌ సోకినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని పాశవికంగా హతమార్చ‌డంతో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తర కొరియాకు చెందిన ఓ అధికారి చైనా పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చారు. కొవిడ్-19 అనుమానంతో అతనిపై నిఘా పెట్టారు. బయటకు ఎక్కడికీ వెళ్లొద్దని నిబంధనలు విధించారు. అయితే సదరు వ్యక్తి ఆ నిబంధనలు ఉల్లంఘించి ఓ పబ్లిక్ టాయిలెట్ దగ్గర తచ్చాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి.. వెంటనే కాల్చి పారేశారు. వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చైనా సరిహద్దును సైతం మూసివేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: