కళ్ళ ముందే బిడ్డ గుక్కపట్టి ఏడుస్తుంటే ఏ తల్లి, తండ్రీ కూడా ఉండబట్టలేరు కన్న పేగు తల్లడిల్లి పోతుంది. అలాంటిది ప్రతీ రోజు ఓ బిడ్డ భాధతో ఏడుస్తూ ఉంటే ఆ కన్న పేగు పరిస్థితి ఊహించడానికి కూడా మనసు భారంగా ఉంటుంది. అసలు తమ బిడ్డ బ్రతకడు అని వైద్యులు చెప్తే కన్నవారి గుండెలు పగిలిపోయినట్టే. ఇలాంటి దారుణమైన పరిస్థితిని  అమెరికాలోని ఓ దంపతుల ఎదుర్కుంటున్నారు. వివరాలలోకి వెళ్తే..

 

అమెరికాలోని కాలిఫోర్నియా కి చెందిన విక్టర్ , ఆండ్రియా దంపతులకి లేకే లేక ఓ చిన్నారి పుట్టింది. పుట్టుకతోనే ఆ బిడ్డ అనారోగ్యంతో పుట్టడమే కాకుండా అత్యంత అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి మూలంగా ఎవరైనా పాపని ముట్టుకుంటే చర్మం ఊడిపోయి చేతిలోకి వచ్చేస్తోందట. ఎంతమంది వైద్యులకి చూపించినాసరే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోంది...అయితే

 

రిసెసివ్ డిస్త్రోక్ బులోసా అని పిలువబడే ఈ వ్యాధి లక్షల ఒకరికి వస్తుందని, పుట్టుకతో వచ్చే ఈ వ్యాధి బ్రతికి ఉన్నంతకాలం వెంటాడుతుందని తెలిపారు వైద్యులు. సాధారణంగా చర్మం కలినప్పుడు మాత్రమే ఊడిపోతుంది. కానీ ఈ పాపని ముట్టుకునేనే చర్మం ఊడిపోవడం  వైద్యులని సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఈ వ్యాధి ఉన్నవారు బ్రతికే అవకాశం 90 శాతం మాత్రమే ఉంటుందని, ఒక వేళ వ్యాధి తగ్గినా భవిష్యత్తులో మరిన్ని చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అని అంటున్నారు వైద్యులు. ప్రస్తుతానికి బాలుడి వైద్యానికి లక్షలు ఖర్చు అయ్యిందని తమ దగ్గర డబ్బులోకే పోవడంతో  “GO fund me” ద్వారా ఆర్ధిక సాయం ఇవ్వాలని కోరుతున్నారు తల్లి తండ్రులు..

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: