ఈ సృష్టిలో ఒక జీవి నుండి మరో జీవికి ఊపిరి పోయడం ఒక అద్భుతం. ఈ ప్రపంచంలో అందరికీ ఇలాంటి అదృష్టం దక్కదు. కేవలం కొంతమందిని మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. మహిళలు మాత్రమే గర్భం దాల్చి ఓ నిండు ప్రాణాన్ని భూ ప్రపంచంలోకి తీసుకొస్తారు. గర్భం దాల్చడం, బిడ్డకు జన్మను ఇవ్వడం అనేది మహిళకు పునర్జన్మ లాంటిది. అలాగే బిడ్డకు జన్మను ఇవ్వడంతోనే సంపూర్ణ మహిళ అనే ఆనందాన్ని పొందుతుంది. అయితే గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు ఎన్నో సందేహాలు వెంటాడుతుంటాయి. 

 

తనకు ఎవరు పుడతారు, సరిగ్గా ప్రసవం జరుగుతుందా, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగానే పుడతారు కదా..ఇలా ప్రతి క్షణం కడుపులోని శిశువు గురించే ఆలోచన చేస్తూ తమలో తామే మధనపడుతూ ఉంటారు. ముఖ్యంగా కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా, లేదా ప్రతి తల్లీ తెలుసుకోవాలనుకుంటుంది. అయితే కొన్ని సూచిక‌ల ద్వారా ఈ ఇది తెలుసుకోవ‌చ్చు. గర్భంతో ఉన్నప్పుడు తిమ్మిర్లు రావడం సహజమే. అలా కాకుండా ఎక్కువగా తిమ్మిర్లు అవుతూ ఉండటం జరుగుతుంటే అధిక మోతాదులో రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. రెండవ,  మూడవ నెలలలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. 

 

ఇది మీ బిడ్డ త్వరగా బయటకు రాబోతున్నాడు అనే తెలిపే సూచిక కూడా.. గర్భంతో ఉన్న మహిళ నుండి విడుదలయ్యే స్రావాలు ఎక్కువగా వాసన వస్తూ ఉండటం, రంగులో మార్పులు మీ బిడ్డ ఆరోగ్యాన్ని తెలుపుతాయి. మీ కడుపులోని బిడ్డ మాములుగా 20 వారాల పరిధిలో తన్నడం మొదలుపెడతాడు. రోజులో కనీసం రెండు గంటలకు ఒకసారి పది సార్లైనా తన్నటం చేస్తుంటారు. ఇలా జరుగుతుంది అంటే బిడ్డ ఆరోగ్యంగా ఉన్న‌ట్టే. గర్భంతో ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ ఉండటమే సహజమే. కాని అధికంగా నొప్పి ఉండటం, భరించలేని విధంగా ఉంటే మీ కిడ్నీ లో లేదా బ్లాడర్ ఇన్ఫెక్షన్ కారణంగా గుర్తించాలి. సో.. అన్నీ తెలుసుకుని జాగ్ర‌త్త‌గా ఉండ‌డం చాలా మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: