ప్రస్తుతం ప్రపంచాన్ని ఫ్యాషన్ అనేది నడిపిస్తుంది. పిల్లల దగ్గర ముసలి వాళ్ళ వరకు అందరూ ఫ్యాషన్, ట్రెండ్ అనే వాటిని అనుసరిస్తున్నారు. కాళ్ళకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ప్రతీ దానికి ట్రెండ్ ను ఫాల్లో అవుతున్నారు. ఆడ మగ, ఇలా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ ఫ్యాషన్, ట్రెండ్ ల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కానీ ఇది ఒక పరిధిలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. 

 

ఈ మధ్య కాలంలో ఒంటికి ధరించాల్సినవి ఏవి ? ఏవి ధరించ కూడదు అన్న కనీస జ్ఞానం లేకుండా పోతుంది. ఉదాహరణకు దేవుడి పటాలను పూజ మందిరం లోనో, లేదంటే ఇంట్లో గోడల మీద పెట్టుకోవడం మనకు తెలిసినదే.  ఆ తర్వాత ఫ్యాషన్, డిజైనర్ వస్తువుల పేరుతో దేవుడి ప్రతిమలతో టెంపుల్ జువేలరి పేరుతో నగలు అందుబాటులోకి వచ్చాయి. చెవి పోగులు దగ్గర నుంచి అన్ని రకాల ఆభరణాలను అందుబాటులోకి వచ్చాయి. 

 

ఇది కొంత వరకు పర్వాలేదు. కొన్నాళ్ళు అమ్మవారి ముఖం, కృష్ణుడు, రాధాకృష్ణ లాంటి వాటిని చీరలకు పెయింటింగ్ వేయించేవారు.  కానీ ఇప్పుడు డిజైనర్ బ్లౌజ్ ల హవా నడుస్తున్న టైం లో ఇంకో అడుగు ముందుకు వేసి జాకెట్లు మీద దేవుడి బొమ్మలను కుట్టించుకుంటున్నారు. గుడిలో ఉండాల్సిన దేవుడు గోడమీద కు వచ్చాడు, ఆ తర్వాత బట్టల మీదకు లేటెస్ట్ గా ఇప్పుడు జాకెట్టు మీద కు వచ్చేశాడు. 

 

ఆ మధ్య ఎవరో విదేశీయులు కాళ్ళకు తొడుక్కునే చెప్పుల పై వినాయకుని బొమ్మను ముద్రిస్తే పాపం చేశారు అని లెంపలేసుకుని విమర్శించారు. మరి డిజైనర్ జాకెట్టు మీద దేవుణ్ణి ఏంచేస్తారు. రోజుకో రకంగా మారుతున్న ప్యాషన్ పేరుతో ఇంకా ముందు ముందు ఏమేం చూడాలో. సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు అయిన భారతదేశంలో ఇలాంటి ప్రవర్తనలు ఇబ్బంది పెడుతున్నాయి. గుళ్ళో ఉండే దేవుడుని ఇలా ఒంటి మీద ఎక్కించుకోవడం ఏంటీ అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: