ఫేస్ రీడింగ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరు ఎలాంటి వారో, వారి స్వభావం ఎలాంటిదో, బయట ఒకలా లోపల మరోలా నటిస్తున్నారా లేదా అనే విషయాలు ఎంతో స్పష్టంగా తెలుసుకుంటారు కొందరు. అయితే కొందరి స్వభావాన్ని తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం. ఇదిలాఉంటే భార్యలని మోసం చేసే మగాళ్ళని యిట్టె కనిపెట్టేయచ్చు అంటూ ఓ సర్వే చెప్తోంది. ఈ సర్వే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది...మరి ఇంకెందుకు భార్యల్ని మోసం చేసే మగాళ్ళని ఎలా కనిపెట్టేయచ్చో తెలుసుకోండి.

 

 

రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ సర్వే వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే దవడలు ధృడంగా ఉండి, చిన్న చిన్న పెదాలు కలిగిన మగవాళ్ళు తమ తమ భాగస్వాములని ఎక్కువగా మోసం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారట. కొందమంది పరిశోధకుల బృందం ఈ విషయంపై సుమారు 1500 మంది మగమ్, ఆడవారిపై ఆన్లైన్ లో సర్వే చేసిందట.ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళందరూ 18 నుంచీ 75 ఏళ్ళ వయసు వారు కావడం మరొక విశేషం.

 

299 మంది మగవారి ఫోటోలని 452 మంది ఆడవారికి చూపించి వారెలాంటి వారో చెప్పాలని కోరారట. అంతేకాదు అలాంటి మగవాళ్ళు తరుచుగా ఎలాంటి మోసాలకి పాల్పడుతారో చెప్పమని, వారికి రేటింగ్ కూడా ఇవ్వమని అడిగారట. అలాగే మీరు తరచుగా పరాయి వ్యక్తుల భాగస్వాములని లోబరుచుకోవడానికి చూస్తారని 299 మంది మగవారిని అడుగగా ఇలాంటి పోలికలు ఉన్న మగవాళ్ళు తరుచు మేము ఇలానే వ్యవహరిస్తామని చెప్పారట. అంతేకాదు ఆడవారిని చేసిన సర్వేలో సైతం ఇలాంటి పోలికలు ఉన్న మగవారికే అధిక రేటింగ్ ఇచ్చారట. దాంతో ధృడమైన దవడలు, చిన్న చిన్న పెదాలు ఉన్నవాళ్ళు అధికంగా ఆడవారిని లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తారని అంటోంది సదరు సర్వే సంస్థ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: