నేటి మంచిమాట.. జీవితం ముగింపులేని ప్రయోగశాల.. ఈ వ్యాఖ్యం చెప్పింది మహాత్మ గాంధీ. అవును జీవితంలో మనం అన్ని నేర్చుకోగలమా? నేర్చుకునే కొద్ది.. ఇంకా కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి.. ఒక్కసారి విజయం సాధిస్తేనే అన్ని వచ్చేసాయి అని సంబర పడిపోకూడదు.. ఎందుకంటే జీవితంలో ఎన్నో సంచలన మనకు తెలియనివి తెలుసుకుంటూ ఉండాలి. 

 

ఇది అనంతం.. మనకు వస్తే మహా అయితే ఒక విద్య రావచ్చు.. లేదా రెండు.. లేదా మూడు.. కానీ ఈ ప్రపంచంలో లెక్క పెట్టలేనన్ని విద్యలు ఉన్నాయి. అది మీకు తెలుసు.. మనకు వంద ఏళ్ళు వచ్చిన మనం ఇంకా తెలుసుకోవాల్సిన విద్యలు చాలా ఉంటాయి. అందుకే జీవితాన్ని ముగింపు లేని ప్రయోగశాల అని అంటారు.. 

 

ఇంకా చెప్పాలంటే.. కొందరు వ్యక్తులకు తెలిసింది ఒక శాతం అయితే.. ప్రపంచమంతా చదివేసినట్టు ఫీల్ అవుతుంటారు.. ఆ అపోహ నుండి బయటకు రండి.. మీరు సాధించింది కేవలం గోరంత.. తెలుసుకోవలసింది కొండంత.. అప్పుడే అన్ని చదివేశం అని ఫీల్ అయితే ఏలా? జీవితం ముగింపులేని ప్రయోగశాల అనేది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన వ్యాఖ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి: