నేటి సమాజంలో చాలా మందికి కొన్ని కొన్ని వాస్తవాలు చెప్తే నచ్చవు. ఇబ్బందిగా తీసుకోవడమే కాకుండా ఫీలింగ్స్ ని హర్ట్ చేస్తున్నారు అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఎవరు అవునన్నా కాదన్నా సరే నేడు వివాహేతర సంబంధాలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పది ఇళ్ళు చూసుకుంటే ఆరు ఇళ్ళలో వివాహేతర సంబంధాలు ఈ మధ్య ఉంటున్నాయి. సాంప్రదాయాలకు, భర్తలకు భార్యలు, భార్యలకు భర్తలు, పిల్లల భవిష్యత్తుకి కనీస విలువ లేకపోవడం, సొంత ఇష్టాలకు విలువ ఇవ్వడంతో వివాహేతర సంబంధాలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనేది వాస్తవం. 

 

భర్త సరిగా ఉండటం లేదని, భార్య సరిగా ఉండటం లేదని భర్త, భార్య అందంగా లేదని భర్త, భర్త దగ్గర ఏదో దొరకడం లేదని భార్య... చిన్నా పెద్దా తేడాలు లేకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. మగాళ్ళు అయితే వేరే ఆడవాళ్ళ తో సంబంధాలు పెట్టుకుంటే ఆడవాళ్ళూ కాలేజి విద్యార్ధులు, ఉద్యోగస్తులు ఇలా... సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది మాకేం ఇబ్బంది లేదు అనే బ్యాచ్ మరొకటి ఉంటుంది. ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం అని కాదు. కుటుంబం అన్నప్పుడు ఒక ప్రపంచం, ఆ ప్రపంచానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. 

 

భావి తరాల భవిష్యత్తు ఉంటుంది. కొన్ని కుటుంబాల పరువు, పదుల సంఖ్యలో జీవితాలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే జీవితాలు నాశనం కావడమే కాకుండా, ఆత్మహత్యల వరకు పరిస్థితులు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి పెళ్లి అయింది అంటే నచ్చినా నచ్చకపోయినా ఆ వ్యక్తే జీవితం. నచ్చకపోతే విడాకులు ఇవ్వడమో లేక మరో మార్గమో ఉంటుంది. కాని వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అనేది ఎంత మాత్రం భావ్యం కాదు. అది మీ ఒక్కరి ఆనందానికి కారణం అయితే, జీవితాలకు శాపం అవుతుంది. ఇలాంటి సంబంధాలు ఎప్పటికి అయినా బయటపడటం ఖాయం. ఆర్ధిక ఇబ్బందులు, ఉద్యోగ ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు ఇలా ఊహించని పరిణామాలు వివాహ వ్యవస్థలో ఎదురు అవుతాయి. సమాజంలో తల ఎత్తుకోలేరు మీ పిల్లలు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: