శారీరక సుఖ౦... శృంగారం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు... ఎక్కడో ఒకరు గాని చాలా మందికి శృంగారం అనేది ఆసక్తి ఉన్న అంశమే. కాని హద్దులు దాటి వెళ్ళడం అనేది ఎంత వరకు మంచిది కాదు. కొంత మంది ఫీలింగ్స్ ని చెప్పుకుంటే మరికొంత మంది చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. సరే అక్కడి వరకు బాగానే ఉంది గాని శారీరక సుఖం కోసం కొందరు పడుతున్న దారులు చూస్తే ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. పెళ్లి అవ్వక ముందు ఏమో గాని పెళ్లి అయిన తర్వాత మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరముంది. 

 

ఒకసారి పెళ్లి అయిన తర్వాత ఆ వ్యక్తికి నీ వలపు అంతా అర్పించాల్సి ఉంటుంది. నచ్చినా నచ్చకపోయినా మూడు ముళ్ళు పడిన తర్వాత ఆ వ్యక్తి మీ సర్వస్వం అవ్వాలి. కాని నేడు కొంత మంది డబ్బులు ఇచ్చి వెళ్ళడం, డబ్బులు తీసుకుని వెళ్ళడం, స్నేహాలు, బంధుత్వాలు, వరసలు అంటూ పులిహోర కబుర్లు చెప్తూ ఎవడికి తోచిన విధంగా వాడు చేయడం అనేది ఎక్కువగా చూస్తూ వస్తున్నాం. ఆడాళ్ళు అయినా మగాళ్ళు అయినా సరే నేడు శారీరక సుఖం కోసం కనీసం తమ పిల్లలకు కూడా విలువ ఇవ్వడం లేదు అనేది వాస్తవం. 

 

ఇక్కడ అందరి గురించి మాట్లాడటం లేదు. ఉద్యోగాలు చేసుకునే వాళ్లకు ఉద్యోగం మీద కుటుంబం మీద ధ్యాస ఉండాలి. కాని నేడు అలా లేదు. ఎవరైనా సన్నిహితంగా మాట్లాడి, వాళ్ళు అందంగా ఉంటే చాలు ఫీలింగ్స్ తెచ్చుకోవడం, వాళ్ళతో తమ సుఖాలు తీర్చుకోవడం వంటివి చేస్తున్నారు. అవి భవిష్యత్తు మీద ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ కొందరు ఆడాళ్ళు మగాళ్ళు కుటుంబాలను వదిలేస్తున్నారు. ఏది అయినా సరే జీవితాన్ని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. శారీరక సుఖం అనేది ఆ పది నిమిషాలు ఉండేది. ఇందుకోసం మీ కుటుంబ, పిల్లలు, ఉద్యోగ జీవితాలను నాశనం చేసుకోవడం అనేది ఎంత మాత్రం భావ్య౦ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: