పబ్ కి వెళ్దామా...? పార్టీకి వెళ్దామా...? ఈ రోజు డ్రింక్ చేద్దామా..? ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్దామా...? డిన్నర్ క్రేజీ గా చేసుకుందామా...? కొంత వరకు ఇవి ఓకే గాని నేటి వివాహ వ్యవస్థలో మాత్రం ఇవి శృతి మించి వెళ్తున్నాయి అనేది వాస్తవం. వ్యక్తిగత అవసరాలు, శారీరక సుఖాల కోసం ఇష్టం వచ్చినట్టు పైన చెప్పిన వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు దంపతులు. భార్య ఒక పబ్ కి తన ఫ్రెండ్స్, సహోద్యోగులతో కలిసి వెళ్తుంటే, భర్త తన ఫ్రెండ్స్ తో ఇతరులతో వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అదుపులో ఉంటే ఓకే. 

 

కాని ఒళ్ళు దగ్గర లేకుండా విచ్చల విడి తనంతో ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. కుటుంబాలను, పిల్లలను వదిలేసి ఎవడికి తోచింది వాడు చేస్తున్నాడు. ఒప్పుకోకపోతే ప్రైవసీ అంటూ మాట్లాడుతున్నారు. ఒప్పుకుంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎవరు ఎం చేస్తున్నారో కూడా ఇంకొకరికి తెలియడం లేదు. పిల్లలను హాస్టల్స్ లో వేయడం, ఇష్టం వచ్చినట్టు టూర్స్ కి వెళ్ళడం, భార్య పుట్టింటికి వెళ్తే భర్త రెచ్చిపోవడం, భర్త ఆఫీస్ కి వెళ్తే భార్య రెచ్చిపోవడం ఈ మధ్య కాలంలో ఈ దరిద్రం ఎక్కువైపోయింది. 

 

అసలు పెళ్లి చేసుకున్న వాళ్లకు విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. దీనితో చాలా మంది జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా కుటుంబాల ను కూడా నాశనం చేస్తున్నారు. స్నేహితులు, కొత్త పరిచయాలతో విచ్చలవిడితనం అనేది ఎక్కువైపోయింది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడంతో కొత్త పరిచయాల ప్రభావాలు, స్నేహాలు వేసే అడుగులు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ప్రేమకు గాని, బంధానికి గాని, అమ్మతనానికి గాని ఎక్కడా కూడా విలువ అనేది ఉండటం లేదు. ఈ పరిస్థితి మారకపోతే మాత్రం భవిష్యత్తులో ఎదుర్కొనే ఇబ్బందులు, మీ తరాలను నాశనం చేయడం ఖాయం అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: