పెళ్లి వరకు నీలో నువ్వు ఎన్ని దాచుకున్నా, పెళ్లి తర్వాత మాత్రం నీకంటూ వ్యక్తిగతం అనేది ఏదీ ఉండకూడదు. భర్త దగ్గర అయినా, భార్య దగ్గర అయినా సరే దాచుకోవడం అనేది ఏదీ ఉండకూడదు. నీ ఇష్టాలు, కోరికలు, నీ అనుభావాలు ఏది అయినా సరే దాపరికం ఉండకూడదు. భర్త దగ్గర ఏదో చెప్పాలా...? ఈ రోజు కాకపోతే రేపు చెప్పు. నీకు పలానా సమస్య ఉందా...? చెప్పేసెయ్. మహా అయితే ఆ కాసేపు గొడవ అవుతుంది. కాని దాచుకుని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఆ ప్రభావం దారుణంగా పడుతుంది. 

 

జీవితం మొత్తం ప్రభావం చూపిస్తుంది. ఇది నా పర్సనల్ మేటర్, ఇది నా పర్సనల్ వ్యవహారం, ఇది నా పర్సనల్ సమస్య అంటూ దాచుకోవడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అది తెలిసినప్పుడు గొడవ అవ్వడం కంటే ముందే చెప్పేస్తే సమస్య ఉండదు కదా...? ఇలా పర్సనల్ అంటూ మైంటైన్ చేసే వాళ్ళ జీవితాలు ఎక్కడా సంతోషంగా ఉండవు. ఎప్పుడూ ఏదోక దాపరికంతో జీవితాన్ని నెట్టుకు రావడమే గాని ఎక్కడా కూడా స్వేచ్చ అనేది ఉండదు. స్వేచ్చ లేని వైవాహిక జీవితం ఉన్నా లేకపోయినా ఒకటే. 

 

ఈ మధ్య కాలంలో ఆర్ధిక, ఇతర విషయాల్లో పర్సనల్ అనేది ఎక్కువైపోయింది. ఎవరికి తోచింది వాళ్ళు చేయడం మనం చూస్తున్నాం. చేసిన వాటిని దాచేయడం కూడా చూస్తున్నాం. భార్యలు వ్యక్తిగత వ్యాపారాలు చేయడం, వాటిలో వచ్చే సమస్యలను భర్తల దగ్గర దాచి వాళ్ళు ఫేస్ చేసి చివరకు తేడా వస్తే ఫ్యాన్ కి వేలాడటం అనేది ఈ మధ్య ఎక్కువైపోయింది. సమస్య వచ్చింది అంటే భార్య దృష్టికి భర్త, భర్త దృష్టికి భార్య తీసుకువెళ్ళాలి. అంతే గాని దాచుకుని పరిష్కించుకోవాలి అనుకోవడం, అందుకోసం బయటి వాళ్లకు ఎక్కువ విలువ ఇవ్వడం అనేది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: