ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకుల పరుగుల జీవితాలే అందరినీ.. అన్నీ డబ్బుతోనే కొనే రోజుల్లో డబ్బు అవసరం లేని అమూల్యమైన వాటినీ మనం విస్మరిస్తున్నాం. అలాంటిదే సూర్యరశ్మి. సూర్యుడనే మహాదీపం జగత్తుకు దివ్య ప్రభల్ని ఆపాదిస్తూ తిమిర సంహారకుడిగా తేజరిల్లుతున్నాడు.

 

 

ఆ సూర్యుడి శక్తిని మనం ఉపయోగించుకోవడం లేదు. కొద్ది సేపు ఎండలో నిలుచుంటే వచ్చే శక్తి అపారం.. అది మన శరీరానికి తేజాన్నిస్తుంది. కానీ మనం ఏసీ గదులకే అలవాటు పడ్డాం. అవకాశం ఉన్నా ఆ సూర్యుడికి ముఖం చూపించడం లేదు.

 

 

సూర్యుడు శక్తివంతుడు.. మన పురాణాలూ ఇదే చెబుతున్నాయి. ఆ సూర్యుడికే శక్తియుక్తుల్ని ఆపాదించే కోటిసూర్యప్రభా భాసితంగా వెలిగే భవ్యరూపమే పరమేశ్వరుడట. ఆ ఈశ్వర చైతన్యం జ్యోతిర్లింగమై ఎన్నో దీపశిఖలుగా విస్తరిల్లింది. శివుడే అద్భుతమైన అఖండ జ్యోతి. ఆ మహాప్రాణదీపం సాకారంచేసే వెలుగు వైభవంతోనే లోకం జాగృతమవుతోందంటారు.

 

 

శరీరమనేది గృహంలాంటిది. ఆ గృహం తేజస్సుతో నిండాలంటే మనోమందిరంలో పరమాత్మ జ్యోతిలా ప్రకాశించాలి. అద్దె ఇంటిలాంటి ఈ శరీరంలో ఆ దీపం నిరంతరం ప్రజ్వరిల్లాలి. నిత్యం దివ్యకాంతులు ప్రసరిస్తూ, ఆ శరీరానికి నవ్యచైతన్యాన్ని అందించాలి.

ఇవి మనసు కోసం.. అలాగే శరీరానికి తగినంత సూర్యరశ్మినీ అందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: