నేటి మంచి మాట..  ఓదార్చే మనసుకున్నా సాయం చేసే గుణమే మిన్న.. ఈ వ్యాఖ్యం చెప్పింది మదర్ తెరిసా. ఆమె గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. జీవితం అంత సేవ చెయ్యడానికే అంకితం చేసింది. సాయం కావాలి అని అడగకముందే సాయం చేసి ప్రజల మనసులో నిలిచిపోయింది. అయితే ఆ సమయంలోనే ఆమె ఈ వ్యాఖ్యం చెప్పింది. 

 

ఎవరో సమస్యలో ఉన్నారు అని వారిని చూసి అయ్యో.. పాపం అని అనుకోవడం వేరు. నేను ఉన్నాను నేను సాయం చేస్తాను అని చెయ్యడం వేరు. ఎంత అయ్యో అనుకున్న సమస్య ఉన్నవారికి అది తీరదు కదండీ.. అందుకే మనం ఒక చెయ్యి వేసి సాయం చెయ్యాలి. 

 

ఈ వ్యాఖ్యానికి అసలైన ఉదాహరణ మీకోసం... ఓ 10వ తరగతి చదువుతున్న అమ్మాయి 9వ తరగతి చదువుతున్న తమ్ముడితో రోడ్డుపై నడుచుకుంటూ స్కూల్ కు వెళ్తుంది. ఆ సమయంలో ఓ వృద్ధురాలు వచ్చి ఆకలిగా ఉంది అని వేరే వారిని అడుగుతుంది. అది చూసి ఆ అమ్మాయి అయ్యో.. పాపం... దేవుడు సాయం చెయ్యాలి ఆమెకు అనుకుంటూ వెళ్తుంది. 

 

కానీ ఆ వృద్ధురాలిని చూసి ఆ అమ్మాయి తమ్ముడు ఆ వృద్ధురాలిని చూసి అయ్యో అనుకోలేదు.. పాపం అనుకోలేదు.. దేవుడిని ప్రార్ధించలేదు. ఒకే పని చేసి అక్క కళ్ల వెంట కన్నీళ్లు తెప్పించాడు. ఏంటి అనుకుంటున్నారా? సాయం చేశాడు. తన దగ్గర ఉన్న పండ్లను తీసుకెళ్లి ఆ వృద్ధురాలికి ఇచ్చాడు. ఇది చుసిన అక్క కళ్ల వెంట నీళ్లు ఆగకుండా వచ్చాయి. అప్పుడు గుర్తొచ్చింది.. ఈ మంచిమాట. ఓదార్చే మనసుకున్నా సాయం చేసే గుణమే మిన్న అని. చూశారు కదా.. అందుకే అయ్యో.. పాపం అనుకోవడం బదులు మీకు చేతనైనంత సాయం చెయ్యండి.   

మరింత సమాచారం తెలుసుకోండి: