చాలా మంది చిన్నప్పుడు మనకేమీ తెలియదు అనుకుంటారు. పెద్దయ్యాక చాలా విషయాలు నేర్చుకున్నాం అనుకుంటారు. చిన్ననాటి కంటే మనం చాలా విషయాల్లో మెరుగు అయ్యాం అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా అసత్యం.. ఎందుకంటే మనం బాల్యం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందిఅసలు చెప్పాలంటే.. ఇప్పటి మన చాలా సమస్యలను బాల్యమే పరిష్కారం. ఎందుకంటే బాల్యంలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి.

 

indian childhood కోసం చిత్ర ఫలితం

 

చినప్పుడు మనం ఎప్పుడైనా విషాదంగా ఉన్నామా.. చాలా తక్కువ. ఎప్పుడూ ఆనందంగా ఉండటం బాల్యంలోనే సాధ్యమవుతుంది. మరి పెరిగాక ఎందుకు అంత ఆనందంగా ఉండం.. చిన్నతనంలో ఉన్నంత ఉత్సాహం, కుతూహలం పెద్దవారిలో అంతగా కనిపించవు. సహజంగా పిల్లలు వేసినన్ని ప్రశ్నలు వయోజనులు వెయ్యలేరు. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం.. కుతూహలంగా ఉండటం.. అందరితోనూ స్నేహంగా ఉండటం బాల్యం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు.

 

indian childhood కోసం చిత్ర ఫలితం

 

 

అంతే కాదు.. ఎప్పటి గొడవను అప్పుడే మరిచిపోవడం కూడా బాల్యంలో సాధ్యం. వయసుతోపాటు వచ్చే జ్ఞానం వల్ల మనిషి మరింత ముందుకుపోతూ తొలినాళ్లలో కలిగిన సందేహాల్ని నివృత్తి చేసుకుంటాడు. ఇదంతా మానసిక స్వేచ్ఛ వల్ల జరిగే కీలక మార్పు. అందుకే మనం బాల్యం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాదంటారా..?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: