చాలా మంది ఇళ్ళలో జంతువులు పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో అత్యధికంగా కుక్కలని పెంచుకోవడానికి ప్రాధాన్యతని ఇస్తారు. వాటిని ఇళ్ళలో మనుషుల్లా సమంగా అన్ని సౌకర్యాలను ఇస్తూ సొంత పిలల్లా సాకుతూ ఉంటారు. కుక్కలు సైతం ఇంట్లో వారి మాటలు వింటూ, వారి చేసే పనులు చూస్తూ అన్ని పసి గడతాయి. మూగ జీవాలకు మాటలు రావు కాని,వాటికి కూడా భాద సంతోషం సహజమే మనుషులలాగానే ఉంటాయి. ఇంకొన్ని శునకాలు అయితే మనుషులకన్నా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాయి.. ఈ కోవకు చెందినదే అమెరికాకు చెందిన ఓ కుక్క..

IHG

అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో అర్థరాత్రి సమయంలో ఒక కుక్క ఒడెస్సా పోలీస్ స్టేషన్ కు పరుగెత్తుకుంటూ వచ్చింది. అంతా దానినే చూస్తున్నారు, తాను తప్పిపోయానని,తిరిగి తన ఇంటికి చేర్చమని ఆ కుక్క పోలీసులకు తన సైగల ద్వారా వివరించింది. కుక్క తనంతట తానుగా వచ్చి తప్పిపోయిన విషయాన్ని  ఇలా తెలియజేయడం చూసి ఆశ్చర్యపోయారు. అది దాని చేష్టలతో వారిని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో వారు ఆ రాత్రంతా ఆ కుక్కను వారి వద్దనే ఉంచుకున్నారు...అయితే..

IHG

తిరిగి అప్పగించడానికి కుక్క మెడలో ఉన్న బెల్ట్ కు కూడా ఎలాంటి గుర్తులు లేకపోవడంతో, వేరే దారి లేక దాని ఫోటోలను ఫేస్ బుక్ లో, “నిన్నటి రాత్రి ఈ కుక్క అనుకోకుండా మా స్టేషన్ కి వచ్చి మాతో ఎంతో సరదాగా గడిపింది” పోస్ట్ చేశారు. ఆ కుక్క ఫొటోస్ వైరల్ కావడంతో యజమాని స్టేషన్  చేరుకొని, రాత్రి నిద్రిస్తున్న సమయంలో కుక్క బయటకు పారిపోయిందని,ఆ క్రమంలోనే దారితప్పిపోయి ఉంటుందని అన్నాడు. ఏదేమైనా ఇన్ని మైళ్ళ దూరంలో ఉన్న పోలీస్  స్టేషన్ కు వచ్చి పెంపుడు కుక్క ఇలా ఫిర్యాదు ఇవ్వటం తనకు కూడా ఆశ్చర్యంగానే ఉందని చెప్పి, కుక్కను తీసుకెళ్ళాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: