జీవితంలో మనిషి విజయం సాధించాలంటే మొదట తనను తాను అర్థం చేసుకోవాలి. లక్ష్యాన్ని మరచిపోకపోవడమే విజయానికి కీలకమని గుర్తుంచుకోవాలి. ఉన్నత ఆశయాలను ఏర్పరచుకుని ఆశయ సాధన దిశగా కృషి చేయాలి. ఆశయం లేని జీవితం చుక్కాని లేని నావలాంటిదని గుర్తుంచుకోవాలి. మనం ఆశయాల్లోనే కాదు, ఆ ఆశయ సాధనలో కూడా ఉన్నతంగా వ్యవహరించాలి. 
 
జీవితం నుండి ఎంత కష్టపడతామో అంతే ఆశించాలి. తెలివి, జ్ఞానం ఉన్నా విజయం వరించకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చుకుని కొత్త అవకాశాలను సృష్టించుకోవాలి. జీవితంలో ఎదురైన ప్రతి అపజయాన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తే మాత్రమే విజయం వైపు అడుగులు వేయగలం. జీవితంలో విజయం సాధించాలంటే ఉన్నత ఆశయాలతో పాటు కొన్ని గుణాలు మనలో ఉండాలి. 
 
జీవితంలో ఎల్లప్పుడూ కోపంతో సమాధానం చెప్పకూడదు. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకూడదు. సంతోషంలో వాగ్దానం చేయకూడదు. అవసరం లేని చోట అబద్ధాలు చెప్పకూడదు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడికి జ్ఞాపకశక్తి ఉండాలి. ఎప్పుడూ నిజాలు చెప్పేవాడికి నిజాన్ని తట్టుకునే ధైర్యం ఉండాలి. ఈ లక్షణాలు మనలో ఉండి ఉన్నత ఆశయాలతో ఆశయ సాధన దిశగా కృషి చేస్తే కొంచెం ఆలస్యంగానైనా విజయం తప్పక సొంతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: