వివాహం అయిన ప్ర‌తి మ‌హిళా త‌ల్లి కావాల‌ని కోరుకుంటుంది. ఎందుకంటే.. సృష్టిలోనే మధురమైనది. తల్లి కాబోతున్నామన్న ఆనందం మహిళల్లో అంతులేనిది.. వర్ణించలేనిది. ఇక మహిళ గర్భం దాల్చిందనే వార్త తెలియగానే అటు పుట్టింట్లో.. ఇటు మెట్టింట్లో పండుగ వాతావరణం నెల‌కొంటుంది. అయితే గర్భం ధరించిన వాళ్ల‌కు కొంత భ‌యంతో పాటు క‌డుపులోని బిడ్డ‌పై అనేక ర‌కాల ప్ర‌శ్న‌లు మైండ్‌లో ర‌న్ అవుతూ ఉంటాయి. అందులో  బిడ్డ ఆడ..? మగ..? అన్న‌ది కూడా ఒక‌టి.

 

మ‌రి క‌డుపులోని బిడ్డ ఆడ‌..? మ‌గ..? అన్న‌ది కొన్నిపద్ధతులు ద్వారా తెలుసుకోవ‌చ్చు. గర్భం సమయంలో మీరు ఎక్కువగా తింటుంటే అమ్మాయి పుడుతుందని, అదే పుల్లని పదార్థాలు తినడం చేస్తుంటే మీకు అబ్బాయి పుట్టబోతున్నట్లు చెబుతుంటారు. గర్భధారణ సమయంలో పొట్ట ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరికి పైభాగంలో పొట్ట కనిపిస్తుంది. మరికొందరికి కింది భాగంలో పొట్ట కనిపిస్తుంది. అయితే పై పొట్ట ఉంటే పాప‌ అని, కిందివైపుగా పొట్ట ఉంటే బాబు అని చెబుతుంటారు.

 
అలాగే గర్భంతో ఉన్నప్పుడు మీ చేతులు మృదువుగా, అందంగా ఉంటే పాప పుట్ట‌బోతున్న‌ట్టు, అదే మీ చేతులు పొడిగా ఉంటే మాత్రం బాబు పుడతాడని అంటుంటారు. చైనీస్ క్యాలెండర్ ప్రకారం తల్లి వయస్సు మరియు ఆమె యొక్క నెలవారీ భావనను పరిగణలోకి తీసుకుని శిశువు లింగాన్ని తెలుపుతారు. గర్భం సమయంలో మొద‌టి మూడు నెల‌లు డల్ గా, మూడీగా ఉన్నట్లయితే మీ ఇంట్లోకి అమ్మాయి వస్తున్నట్లు. అలా కాకుండా యాక్లీవ్‌గా ఉంటే మాత్రం అబ్బాయి పుట్టబోతున్నట్లు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: