పిల్ల‌ల‌కు సెల‌వ‌లు వ‌స్తే చాలు త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ని పార్కుల‌కి, సినిమాల‌కి, షాపింగ్‌మాల‌కి తిప్పుతూ ఉంటారు కానీ అస‌లు రియ‌ల్ లైఫ్ ఏంటి అన్న‌ది వాళ్ళ‌కి చూపించాలి. స‌మాజంపై వాళ్ళ‌కి ఒక అవ‌గాహ‌న క‌ల్పించాలి. పిల్ల‌ల‌ను సెల‌వుల స‌మ‌యంలో పోస్ట్ ఆఫీస్‌, బ్యాంక్‌, ఈసేవా అలాంటి వాటికి తీసుకువెళ్లాలి వాటి పై వారికి అవ‌గాహ‌న పెంచాలి. అక్క‌డ జ‌రిగే ప‌నుల గురించి తెలియ‌జేయాలి. పోస్ట్ ఆఫీస్‌లో ఏ ప‌నులు ఉంటాయి ఏమి చేస్తాము. అక్క‌డ ఎలాంటివి జ‌రుగుతాయి అన్న‌వి తెలుసుకోవాలి. 

 

పిల్ల‌ల‌కి దాని పైన ఒక అవ‌గాహ‌న క‌ల్పించాలి. అలాగే బ్యాంక్‌లు డ‌బ్బులు, డిపాజిట్‌లు, మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌లు స్కీమ్‌లు ఇలా ఇలాంటి వాటి పై కూడా అప్పుడ‌ప్పుడు పిల్ల‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి. అలాగే ఇక ఈసేవ‌లో ఎలాంటి ప‌నులు జ‌రుగుతాయి  ఏంటి అన్న‌ది తెల‌పాలి. అక్క‌డ జ‌రిగే ప‌నుల గురించి వాటిపై అవ‌గాహ‌న క‌ల్పించాలి. 

 

ఇలాంటి వాటి పై వాళ్ళ‌కు ఒక అవ‌గాహ‌న రావ‌డం వ‌ల్ల ఎక్క‌డ ఏ ప‌నులు జ‌రుగుతాయి వాటి విలువ ఏంటి అన్న‌ది తెలుస్తుంది. ఉప‌యోగాలు తెలుస్తాయి. బ‌య‌ట ఎలా ఉండాలి. పిల్ల‌లు ఎప్పుడ‌న్నా బ‌య‌ట‌కు వెళ్లి ఏవ‌న్నాప‌నులు చెయ్యాల‌న్నా భ‌య‌ప‌డ‌కుండా వాళ్ళ‌కు ఒక అవ‌గాహ‌న ఉంటుంది. బ‌య‌ట ఎలా ఉండాలి. ఎక్క‌డికి వెళితే ఏ ప‌నులు జరుగుతాయి ఏంటి అన్న‌ది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: