అత్తాకోడ‌ళ్ళ బంధ‌మంటే ఒకప్పుడు అత్త‌కి కోడ‌లు భ‌య‌ప‌డేది. అత్త చెప్పిన మాట వింటూ అత్త అడుగు జాడ‌ల్లో న‌డ‌వాల‌నే కాన్సెప్ట్‌తో ఉండేది. మ‌రి ఇప్పుటి కోడ‌ళ్ళు ఫాస్ట్‌గా ఉంటున్నారు. కోడ‌లు చెప్పిన‌ట్లు అత్త వినాల‌న్న టైపులో ఉంటున్నారు. మోడ్ర‌న్ యుగంలో చ‌దువులు..,టెక్నాల‌జీ.. ఫాస్ట్‌నెస్ పెర‌గ‌డంతో కాస్త‌ఫాస్ట్‌గా ఆలోచిస్తారు. ప్రేమ అభిమానం, బంధాలకు విలువ‌లు త‌క్కువ‌.  పెద్ద‌ల‌ను ఎలా గౌర‌వించాలి. ఏద‌న్నా చేసే ముందు వాళ్ళ స‌ల‌హాలు తీసుకోవాలి. వాళ్ళ‌ను అడిగి చెయ్యాలి ఇలాంటి సెంటిమెంట్‌ల‌న్నీ ఇప్పుడు ఎవ్వ‌రూ పాటించ‌డం లేదు ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వాళ్ళు ఉంటున్నారు.

 

పైగా ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ అస‌లు క‌లిసి ఉండ‌డం లేదు. పెళ్ళైన వెంట‌నే భ‌ర్త‌ను తీసుకుని వేరు కాపురం పెడుతున్నారు. దాంతో అత్త కోడ‌ళ్ళ మ‌ధ్య ప్రేమ అభిమానం, అలాగే గౌర‌వం లాంటివి ఉండడం లేదు. ఇక ఎవ‌రి కాపురం వాళ్ళ‌ది అవ్వ‌డంతో ఒక‌ళ్ళ‌ని అడిగి మ‌రి స‌ల‌హాలు పాటించ‌డం అనేది అస‌లు ఉండ‌డం లేదు. ఇక ఇంకొంచం హై లొకాలిటీలో అయితే హాయ్ ఆంటీ అంటూ ఎప్పుడో ఒక‌సారి ఫార్మాలిటీగా ప‌ల‌క‌రించుకోవ‌డం. అలాగే మంచి చెడుల గురించి చెప్ప‌డం లాంటివి ఏమీ ఉండ‌డం లేదు

ఎప్పుడో ఒక‌సారి క‌ల‌వ‌డంతో ఏదో మాకు వాళ్ళ‌తో ఏం ప‌ని అన్న‌ట్లు వాళ్ళు వాళ్ళ మీద ఆధార‌ప‌డ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదంటూ వీళ్ళు ఉంటున్నారు త‌ప్పించి ప్రేమా ఆప్యాయ‌త‌లు అనేవి చాలా త‌క్కువ‌గా ఉంటున్నాయి. ఏదో ఫంక్ష‌న్ ఉంటేనే ఇంటికి వ‌స్తున్నారు. చుట్ట‌రిక‌పు చూపులో వ‌చ్చి చూసి వెళ్లిపోతున్నారు త‌ప్పించి అత్త మామ మ‌న బాధ్య‌త అన్న‌ట్లు నేటి కోడ‌ళ్ళు ఉండ‌డం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: