తల్లి అనిపించుకున్నప్పుడే ఆడజన్మకు సార్థకత. పెళ్లి అయిన ప్ర‌తి అమ్మాయి.. అమ్మతనం కోసం తపిస్తుంది. ఇక అమ్మతనం పొందిన దగ్గర్నుండి ప్రసవ సమయం వరకు బిడ్డ క్షేమం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే మహిళలు మామూలు సమయాల్లో కంటే గర్భ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహార విష‌యంలో మ‌రింత జాగ్ర‌త వ‌హించాలి. గర్భిణీ స్త్రీలు సరైన ఆహారంను తీసుకొన్నప్పుడే కడుపులో బిడ్డ‌ యొక్క అభివృధ్ది ఆరోగ్యకరంగా ఉంటుంది.

 

అయితే గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటేనే మంచిది. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి. ప్రెగ్నన్సీ సమయంలో కెఫిన్ అధికంగా ఉండే కాఫీ తీసుకోవడం, గర్భంలోని పిండం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. దీనికారణంగా పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుడుతారు. అంతేకాకుండా, ఒక్కోసారి మిస్ క్యారేజ్ అయ్యే ప్ర‌మాదం కూడా ఉంది. అలాగే పాలుప్రెగ్నన్సీ సమయంలో తీసుకోవడం చాలా మంచిది. మీ శరీరానికి కావాలిన కాల్షియమ్,  ప్రోటీన్స్ ను అందిస్తుంది. 

 

కానీ సరిగా కాగపెట్టని లేదా పాచ్చి పాలను మాత్రం తాగ‌కూడదు. ఎందుకంటే, అందులో ఉండే  బాక్టీరియా క‌డుపులోని బిడ్డ‌పై దుష్ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా, సరిగ్గా ఉడకని మాంసానికి దూరంగా ఉండాలి. ఉడికి ఉడకని మాంసంలో ఉండే సాల్మొనెల్లా లిస్టిరియ అనే బాక్టీరియా ఉంటాయి. ఇవి మీ నుంచి కడుపులో ఉన్న మీ పిల్లలకు చేరి, వారికి హాని కలిగిస్తాయి. అందుకే మీరు ప్రెగ్నన్సీ సమయంలో తీసుకునే ఆహారాన్ని బాగా ఉడికించి తినండి. సో.. బీకేర్‌ఫుల్‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: