మనకు చాలా అంశాలపై స్థిర అభిప్రాయాలు ఉంటాయి. వాడు అలాంటి వాడు.. వీడు ఇలాంటివాడు.. కానీ చాలా సార్లు అవన్నీ నిజం కాకపోవచ్చు.. కొన్ని సార్లు అవి సగం సగం సత్యాలు కావచ్చు. అందుకే రెండో వైపు కోణం చూడకుండా ఓ అభిప్రాయానికి రాకూడదు.

 

ఇందుకు ఉదాహరణగా.. ఓ చిన్న కథ చెబుతాను. సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకొంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే ఈ సముద్రం మహా దొంగ అనుకున్నాడు. కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో ఈ సముద్రం గొప్ప దాత అనుకున్నాడు.

 

 

అదే సముద్రంలోఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు. అతని తల్లి ‘ ఈ సముద్రం నా కొడుకులాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి అనుకుంది. ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్లి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరాడు. అతను ఆ ఇసుకలో ‘ఈ సముద్రం ఒకటి చాలు జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను ‘ అనుకున్నాడు.

 

ఇక్కడ అందరూ వారి వారి కోణాల్లో కరెక్టే.. అందుకే ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నింటిని విని ఒక నిర్ణయానికి రాకూడదు. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి. అడుగు వేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: