వాడు ఎదిగిపోతున్నాడు.. వీడి ఎదిగిపోతున్నాడని పక్కనోడిని చూసి చాలా మంది కుళ్లుకుంటారు. విచిత్రం ఏంటంటే.. వారు తమలో ఉన్న టాలెంట్ మాత్రం గుర్తించరు.

కొన్ని పనులు మనకు పుట్టుకతో వస్తాయి. కొన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడంలో ఆనందం ఉందన్న సంగతి మనందరికీ తెలుసు.



అయితే ఇలా నేర్చుకునేందుకు చాలా మంది ఉత్సాహం చూపించరు. సీతాకోకచిలుకకు ఎగరడం మనం నేర్పక్కరలేదు. చేపకు ఈత నేర్పక్కరలేదు. ప్రకృతితో మమేకమై జీవించే జీవులకు నేర్చుకునే బాధ లేదు. అవి సహజంగా వాటికి అబ్బుతాయి. ఇది మనకూ అవసరమే. నేర్చుకోవడంలోనే ఆనందం వెదుక్కోవాలి. నిజానికి ఆనందాన్నే సృష్టించడం నేర్చుకోవాలి. ఆనందం బజారులో దొరికే వస్తువు కాదు.



నిత్యం నేర్చుకోవడమన్నది మనిషికి చాలా ఇంపార్టెంట్. కుండలు తయారు చేసేవాడు ఎంత నైపుణ్యంగా, శ్రద్ధగా, ఏకాగ్రతతో చేస్తాడో అలా ప్రతి మనిషీ ఏదో ఒకటి నేర్చుకోవడంలో ఆనందం పొందాలి. మీలో ఉన్న టాలెంట్ గుర్తిస్తే.. ఇక ఇబ్బందే ఉండదు. మీదారి మీరు వెళ్లండి.. పక్కనోడిని చూసి కన్‌ఫ్యూజ్ కాకండి.



మరింత సమాచారం తెలుసుకోండి: