ప్రపంచ వ్యాప్తంగా కరోనా చూపిస్తున్న ఎఫ్ఫెక్ట్ మాములుగా లేదు. చిన్నా, పెద్ద, ఉన్నోడు, లేనోడు, మంచి , చెడు, ఇలా ఎలాంటి బేషజాలు లేకుండా తన విశ్వరూపం ప్రతీ ఒక్కరిపై చూపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రవాదుల అమ్మ మొగుడులుగా తన పని తను చేసుకుపోతోంది. కరోనా నా తొక్కా అది మావరకూ రానివ్వం అంటూ తొడలు కొట్టిన ట్రంప్ ఇలాఖాలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 200 మందిని పైగా పొట్టనబెట్టుకుంది. వేల మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు...ఈ క్రమంలోనే...

IHG

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఇప్పుడు మోడీ చూపిన బాటలో పయనిస్తోంది. భారత్ లో జనతా కర్ఫ్యూ మాదిరిగానే అమెరికాలో కరోనా ముప్పునుంచీ తప్పించుకోవడానికి అక్కడి కాలిఫోర్నియా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా వైరస్ దృష్ట్యా ప్రతీ ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచనలు చేసింది. దాంతో శాన్ఫ్రాన్సిస్కో , లాస్ ఏంజిల్స్ నగరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. భారతీయులు ఆధారపడి నడుస్తున్న దుఖాణాలు అన్నీ మూతపడ్డాయి...దాంతో వేలాది మంది భారతీయులు నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

IHG

ఇదిలాఉంటే తమ వద్ద నిత్యావసర వస్తువులు అధికంగా ఉన్న భారతీయులు చాలా మంది తోటి భారతీయులకి అందిస్తున్నారు. అయితే మౌలిక అవసరాలు కనీసం సమకూర్చుకోనివ్వకుండా ఇలా ఒక్క సారిగా లాక్ డౌన్ చేయడం సరైన పద్దతి కాదని భారతీయ దుఖాణాలు తెలిపించాలని సిలికాన్ వ్యాలీ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు అక్కడి గవర్నర్ కి వినతిపత్రం అందించారు. అయితే అమెరికా వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని ఫెడరల్, రాష్ట్ర ప్రభుత్వాలని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్సంస్థ అధ్యక్షుడు భారతీయుడైన సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలని ప్రభావితం చేయగల సత్తా ఈ అసోసియేషన్ కి ఉంది. ఈ విషయంపై స్పందించిన సురేష్ రెడ్డి కరోనా ప్రభావం రానున్న రోజుల్లో ఆర్ధిక వ్యవస్థని కుప్ప కూల్చుతుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: