ప్రపంచం మొత్తం ఎవరినోట విన్నా కరోనా చర్చే. ఈ వైరస్ విరుగుడికి ఎవరైనా మందు కనిపెడితే బాగుంటుంది అంటూ ప్రపంచం మొత్తం  వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది. మరో పక్క అలుపెరుగకుండా నిపుణులు ఈ మందు విరుగుడి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ వ్యాధి సోకితే ఇలాంటి లక్షణాలు ఉంటాయి జాగ్రత్తలు వహించండి అంటూ ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నాయి. అయితే కరోనా విషయంలో తాజాగా ఓ దేశం చెప్పిన విషయం వింటే షాక్  అయ్యి షేక్ అవ్వడమే కాదు. మనలో మనకి ఎన్నో అనుమానాలు కలగక మానవు. అదేంటంటే...

IHG

కరోనా కి సంభందించి ఎలాంటి లక్షణాలు కనిపించని వారిలో కూడా కరోనా వైరస్ సోకుతున్నట్టుగా తాజాగా జరిగిన పరిసోధనల్లో తేలిందట. ఐస్ ల్యాండ్ ప్రభుత్వం ఇటీవల తమ దేశ ప్రజలకి కరోనా పరీక్షలు నిర్వహించిన నేపధ్యంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఐస్ ల్యాండ్ లో కేవలం 4 లక్షల జనాభా మాత్రమే ఉంటారు. దాంతో ప్రభుత్వం అందరికి కరోనా పరీక్షలు నిర్వహణ చేపట్టింది..ఈ క్రమంలో

IHG

కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మందికి కరోనా వ్యాధి లక్షణాలు లేవట. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు లేకపోయినా సరే ఈ వ్యాధి వారికి సోకిందని వైద్యులు ప్రకటించారు. దాంతో చైనా లో డేటా ని పూర్తిస్థాయిలో పరీక్షించిన  ఐస్ ల్యాండ్ యంత్రాంగం చైనాలో ఈ వైరస్ బారిన పడిన వారిలో మూడో వంతు మందికి ఎలాంటి లక్షణాలు లేవని గుర్తించారు. కానీ అలాంటి వారి నుంచీ మెల్లమెల్లగా వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోందని ప్రపంచం మొత్తం కేవలం వైరస్ ఉన్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: