మీరు గెలవాలంటే ఏం చేయాలి.. వాదనలో అవతలి వారిని మెప్పించాలి.. చక్కగా వాదించగలగాలి. మైమరపించేలా సంభాషించగలగాలి. అప్పుడే గెలుస్తాం.. అనుకుంటారు అందరూ.. లైఫ్ స్కిల్స్ లో చక్కగా మాట్లాడటమే గొప్ప అనుకుంటారు. 

 

కానీ అంతకంటే గొప్పదైన నైపుణ్యం మరొకటి ఉంది. అది మీకు ఎప్పుడూ విజయం తె‌చ్చి పెడుతుంది అదేంటో తెలుసా.. వినడం.. అవును.. నిజమే.. చక్కగా మాట‌లాడటం కంటే.. చక్కగా వినడం గొప్పదని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పేమాట. 

 

చెప్పడానికి చాలా సులభంగా అనిపించినా వినడం అంత సులభం కాదు. ఎదుటి వారు చెప్పేది వినాలంటే.. మీకు చాలా ఓపిక కావాలి. అది చాలా కష్టమైనది కూడా. మీరు వినడం కనుక అలవాటు చేసుకుంటే మీకు శ్రద్ధ, ఏకాగ్రత వాటంతట అవే ఏర్పడతాయి. అంతే కాదు..  ఆలోచన, తార్కిక శక్తి పెరుగుతుంది.

 

బాగా వినడం వల్ల గొప్ప సహనం అలవడుతుంది. అందుకే ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఎదుటి వారు చెప్పేదాంట్లో మంచి ఉంటే స్వీకరించాలి. చెడు ఉంటే వదిలేయాలి. ఇప్పుడు అర్థమైందా చెప్పడం కంటే వినడం ఎంత మంచి కళో.

మరింత సమాచారం తెలుసుకోండి: