జీవితంలో కష్టపడందే ఏదీ రాదు.. అది ఎంత కోటీశ్వరుడైనా.. నిరుపేద అయినా కష్టపడకుండా ఏదీ సాధించలేడు. అయితే కొంత మందికి వారసత్వం ద్వారానో.. అదృష్టం ద్వారానో ఉన్నత శిఖరాలు పొందొచ్చు. ఆస్తిపాస్తులు కూడ బెట్టుకోవచ్చు. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందొచ్చు. కానీ వారి అంతరంగంలోకి తొంగి చూస్తే అంత ఆనందం కనిపించదు.

 

 

కష్టాలకు ఎదురొడ్డి నిలిచి గెలిచిన వాడు జీవితంలో సదా ఆనందంగా ఉంటాడు. ఆత్మ విశ్వాసంతో ఉంటాడు. నలుగురికి దారి చూపిస్తాడు.. నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తాడు. ఇందుకు ప్రకృతిలోనూ అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ప్రకృతి ప్రతికూలతలు కల్పిస్తున్న ప్రతీసారి, ప్రతిఘటించేందుకు చెట్టు తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.

 

 

ఒక చెట్టు నిలదొక్కుకునేందుకు నేలను తన్ని మరీ ఆకాశంవైపు సాగిపోతుంది. ఇదే సూత్రం విజయవంతమైన వాడికీ వర్తిస్తుంది. కార్యసాధకుడు కాలం తన సంకల్పానికి సవాళ్లు విసిరినకొద్దీ స్థిరచిత్తంతో ముందుకు సాగిపోతూనే ఉంటాడు. అందుకే మీ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తే మీరు అంత గొప్ప హీరో అవుతారు. ప్రతి కష్టాన్ని అధిగమిస్తూ ముందుకు దూసుకుపోతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: