చాలా మంది పురుషులు శృంగారం త‌ర్వాత వెంట‌నే నిద్ర‌లోకి జారుకుంటారు. అయితే మ‌హిళ‌లు మాత్రం వెంట‌నే శృంగారం మోహం నుంచి బ‌య‌ట‌కు రారు. శృంగారం త‌ర్వాత కొంత మంది సున్నిత టాక్‌ని ఇష్ట‌ప‌డుతుంటారు. కానీ పురుషుల‌కు మాత్రం నిద్ర త‌న్నుకొచ్చేస్తుంటుంది. అయితే ఇలా నిద్ర‌లోకి జారుకోవ‌డానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. శృంగారంలో భావ ప్రాప్తి త‌ర్వాత పురుషుడిలో చాలా ర‌కాల ర‌సాయ‌నాలు విడుద‌ల‌వుతాయి. దాంతో నైట్రిక్ యాసిడ్‌, ఆక్సిటోసిన్ మ‌రి కొన్ని ఉంటాయి.

 

ఇవన్నీ ఒక‌ర‌కంగా నిద్ర‌కు ఉపేక్ష‌గా ప‌ని చేస్తాయి. సాధార‌ణ స‌మయంలో కంటే పురుషుల్లో శృంగారం స‌మ‌యంలో విడుద‌ల‌య్యే పొలాక్సిన్ ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి నిద్ర ముంచుకొచ్చేస్తున్న ఫీలింగ్ క‌లుగుద్ది. శృంగారం త‌ర్వాత పూర్తిగా శ‌రీరం రిలీక్స్‌ని కోరుకుంటుంది.అందులోనూ శృంగారంలో స్త్రీ కంటే పురుషుడు కొంచం ఎక్కువ క‌ష్ట‌ప‌డ‌తారు ఆ విష‌యం మ‌న‌కు తెలిసిందే దీంతో శ‌రీరం పూర్తిగా అలిసిపోతుంది. దాంతో వెంట‌నే వారు ఏమీ ఆలోచించ‌కుండా నిద్ర‌పోతుంటారు.

 

కానీ చాలా మంది స్త్రీలు మాత్రం కొంచం మాట్లాడుకుంటూ రొమాంటిక్‌గా గ‌డిపితే బావుంటుంది అంటున్నారు. ఇందుకు కార‌ణం ఏమిటంటే...చాలా మంది స్త్రీల‌లో మేము కేవ‌లం సెక్స్ కోస‌మేనా అన్న ఫీలింగ్ క‌లుగుతుంది. అంతే కాక సెక్స్ అంటే అదొక్క‌ట్టేనా. భార్య అంటే కేవ‌లం సెక్సేనా ఇలా ర‌క ర‌కాల మ‌నో భావాలు క‌లిగి బాధ‌ప‌డుతుంటారు. కాబ‌ట్టి ఏ పురుషుడైనా స‌రే సెక్స్ అయిపోయిన త‌ర్వాత కొంత స‌మ‌యం వారితో కేటాయిస్తే వారు చాలా ఆనంద‌ప‌డ‌తారు. అప్పుడు ఇద్ద‌రి జీవితం కూడా చాలా ఆనందంగా స‌జావుగా సాగుతుందని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: