కరోనా తో భారత్ లో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వ్యాపారులు, ఉద్యోగులు ఇలా ప్రతీ ఒక్కరూ ఆర్ధికంగా తీవ్ర నష్టాన్ని చవి చూస్తున్నారు. ఈ లాక్ డౌన్ ఈ నెల 14 వరకూ ఉండనుంది. ఒక వేళ ఈ పరిస్థితి మరింతగా ముదిరి మరో 15 రోజులు లాక్ డౌన్ పెరిగితే ఊహించడానే ఎంతో కష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల ద్వారా ప్రజలు తీసుకే అప్పుకి చెల్లించే EMI విధానం పై  మూడు నెలలు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.

IHG

ప్రజల ఆర్ధిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఈ విధమైన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే ఇందుకు అన్ని బ్యాంకింగ్ సంస్థలు, ఫైనాన్స్ సంస్థలు సహకరిస్తామని చెప్పాయి. ఈ క్రమంలోనే sbi కూడా మారటోరియం అమలు చేస్తున్నట్టుగా ప్రకటించింది. 2020 మార్చి 1 నుంచీ మే 31 వరకూ అన్ని టర్మ్ లోన్స్ , EMI లపై మారటోరియం విధించింది. ఎలాంటి లోన్ తీసుకున్న వారైనా సరే మూడు నెలల పాటు EMI లు చెల్లించకపోయినా పర్వాలేదు. అలాగే మార్చి 1 నుంచీ ఇప్పటి వరకూ ఎవరినా ఎటువంటి EMI లు చెల్లించినా అవి వెనక్కి తీసుకోవచ్చని తెలిపింది...ఎలా వెనక్కి తీసుకోవచ్చంటే...

IHG

EMI మారటోరియం కావాలనుకునే వారు ఈ పద్ధతులను పాటిస్తే సరిపోతుంది

EMI నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ ద్వారా ఆటో డెబిట్ అవుతుంటాయి అందుకే  Annexure II  దరఖాస్తు ఫారం పూర్తి చేసి Annexure III  లో ఉన్న ఈమెయిల్ ఐడి పంపించాలి ఇదొక పద్దతి. అంతేకాదు.

 

ఇప్పటికే అంటే మార్చి 1 నుంచి ఇప్పటివరకు EMI చెల్లించితే  వెనక్కి తీసుకోవచ్చు అందుకుగాను ఏమి చేయాలంటే. Annexure I ఫారం పూర్తి చేసి Annexure III  లో ఉన్న ఈమెయిల్ ఐడి పంపించాలి. ఇలా చేస్తే 7 రోజుల్లో మీ డబ్బు మీ ఖాతాల్లోకి వస్తుందని ప్రకటించింది SBI

అప్లికేషన్ ఫామ్ కోసం  : https://bank.sbi/stopemi

 

మరింత సమాచారం తెలుసుకోండి: