ఆడవాళ్లకు అందం అవసరమే.. కానీ కొన్ని విషయాల్లో ఇంత ఓవర్ అవసరమా అనేలా చేస్తారు. సాధారణంగా ఆడవాళ్లు ఎవరైనా సరే.. వాళ్ళు ధరించిన దుస్తులకు తగ్గట్టు సరిగ్గా మ్యాచ్ అయ్యేలా చెవి దిద్దులు.. అదే రంగు గాజులు వేసుకుంటారు. మరి కొందరు కాస్త శృతి మించి చెప్పులు.. చేతికి అదే రంగు వాచ్ కట్టి అబ్బో అన్ని మ్యాచ్ కావాలి అని అనిపించుకుంటారు. 

 

ఇంకా ఇప్పుడు అంతటితో ఆగిపోవడం లేదు... కరోనా వైరస్ కారణంగా ముఖానికి ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఆఖరికి ఆ మాస్కులు కూడా డ్రెస్ లకు మ్యాచ్ అయ్యేలా ధరించి వారికి మ్యాచింగ్ పిచ్చి ఎంత ఉంది అనేది తెలియజేస్తున్నారు. స్లొవేకియా ప్రెసిడెంట్‌ జుజన కపుటొవ దుస్తులకు సరిగ్గా మ్యాచయ్యే మాస్కులు ధరించి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 

 

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. చేతులకు శానిటైజర్.. ముఖానికి మాస్కులు.. కాళ్లకు సాక్సులు ఇలా ప్రతిదీ పాటిస్తున్న సమయంలో ఆమె కూడా ఆ జాగ్రత్తలు పాటిస్తూనే మ్యాచింగ్ మాస్కు వెస్కొని వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా మెరూన్‌ రంగు దుస్తులకు మ్యాచయ్యే మాస్కు పెట్టుకుని జుజన కపుటొవ అధికారిక కార్యక్రమానికి హాజరై తన ప్రత్యేకతను చాటుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: