సాధార‌ణంగా త‌మ పిల్ల‌లు ఆరోగ్యంగా, బ‌లంగా ఉండాల‌ని త‌ల్లి ప‌డే తాప‌త్రాయం అంతా ఇంతా కాదు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి కాస్తా పెద్దవాడై స్కూల్‌కు వెళ్లేవరకు ఎలాంటి ఆహారాన్ని అందించాలో అనే ఆలోచన ప్రతి తల్లికి వస్తుంది.  శరీరం విధులు నిర్వహించేందుకు కావాల్సిన శక్తిని అందిస్తూ ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి, రోగాలతో పోరాడటానికి అవసరమైన శక్తిని అందించేదే నిజమైన పోషకాహారం. ఎదిగే వయసులో తగినంత పోషకాహారం లభించకపోతే ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది. 

 

పిల్లల్లో శరీర పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వారి ఆహారం పట్ల ప్రదాన శ్రద్ధపెట్టాలి. పిల్లలకు 6 నెలలు దాటిన తర్వాత అన్నం పెట్టొచ్చు. అయితే ఆ అన్నం గట్టిగా ఉండకూడదు. మెత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి అరుగుదల శక్తి తక్కువ కాబ‌ట్టి. అయితే చాలా మంది ఉన్న ప్ర‌శ్న‌.. పిల్ల‌ల‌కు ఏ వ‌య‌స్సు నుండీ మాంసాహారం పెట్టాలి..? వాస్త‌వానికి మిగతా ఆహారంతో పోల్చితే మాంసాహారంలో కేలరీలు, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆహారం అంత త్వరగా పెట్టడం మంచిది కాదు. 

 

పిల్లలకి ఏడాదిన్నర వచ్చిన తర్వాత నుంచి మాంసాహారం పెట్టొచ్చు. ఇక . పిల్లలకు ఆరు నెలల నుంచి ఉడికిన గుడ్డు పెట్టొచ్చు. అది కూడా తెల్లసొన మాత్రమే పెట్టాలి. పచ్చ సొన త్వరగా పిల్లలకు అరగదు. కాబట్టి కొన్ని రోజుల వరకూ అది పెట్టకపోవడమే మంచిది.  మ‌రియు ఆరో నెల నుంచి ఉడికించిన బంగాళదుపం, క్యారెట్‌, ఆపిల్‌, అరటి పండు వంటివి పెడుతూ ఉండాలి. ఇలా పిల్ల‌ల‌కు పోషకాహారం ఇవ్వ‌డంతో వ‌ల్ల వారు ఆరోగ్యంగానే కాకుండా బ‌లంగా కూడా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: