ఎవరైనా చనిపోతే వారి వారి సాంప్రదాయాల ప్రకారం కాల్చుతారు, లేదా పూడ్చి పెడుతారు కానీ ఈజిప్ట్ సాంప్రదాయం ప్రకారం అప్పట్లో చనిపోయిన వారిని శవపేటికలో పెట్టి భద్ర పరుస్తారు. వారికి ప్రత్యేకంగా లేపనాలు పూసి, వారి స్మృతులు చెక్కు చెదరకుండా ఉండేలా చర్మాన్ని సైతం కాపాడే పద్దతిలో ఓ వస్త్రాన్ని చుట్టి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు. వారినే మమ్మీ లు అంటారు. చనిపోయిన వారికి ఎంతో ఇష్టమైన వస్తువులను అందులో ఉంచుతారు. ఒక వేళ ఎవరైనా రాజు చనిపోతే వజ్ర వైడ్యూర్యాలతో, బంగారంతో పూడ్చి పెడుతారు.

IHG

అయితే ఇలాంటి సంఘటనలు అన్నీ మనం విన్నవే, చూసినవే ఎన్నో సినిమాలలో సైతం ఈ తరహా సంఘటనలు మీరు చూసే ఉంటారు. కొన్ని కొన్ని మమ్మీలు పాడయిపోయినా వారితో పాటు ఉండే వస్తువులు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. అవి అప్పటి పరిస్థితులని పద్దతులని తెలిపేలా చేస్తాయి. తాజాగా ఈజిప్ట్ కి చెందిన ఓ మమ్మీ శవాన్ని బయటకి తీసి చూడగా అందరూ ఆశ్చర్యపోయేలా ఓ వస్తువు కనిపించింది...

IHG

దాదాపు 3000 వేల ఏళ్ళ నాటిదిగా భావిస్తున్న ఈ శవపేటికని స్కాట్లాండ్ లో ప్రదర్శనకి ఉంచడానికి బయటకి తీశారు. ఈ క్రమంలో ఆ శవపేటిక తెరిచి చూడగా అందులో మమ్మీ తో పాటుగా కళ్ళు చెదిరే పెయింటింగ్ ఒకటి బయటపడింది. ఈ మమ్మీ తా- కర్- హాబ్ ప్రాచీన ఈజిప్ట్ మహిళా పూజారిణి లేదా యువరాణికి చెందినది అయ్యి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే. అందులో దొరికిన చిత్రం ఎంతో అద్భుతంగా ఉందని, ఈ పెయింటింగ్ ఈజిప్ట్ దేవతగా కొలిచే అమెంటేట్ గా గుర్తించారు. ఇంత పురాతనమైన, అద్భుతమైన చిత్రం ఇప్పటి వరకూ ఈజిప్ట్ లో బయటపడలేదని ఇంత అద్భుతమైన అందమైన చిత్రం చూడటం మొదటి సారని అంటున్నారు చరిత్ర కారులు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: