సాధార‌ణంగా భార‌త‌దేశంలో మ‌హిళ‌లు నల్లదారాన్ని కట్టుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.  ఇది మ‌న హిందూ సంప్ర‌దాయంలో పూర్వం నుంచి వ‌స్తున్న ఆచార‌మే. ఎందుకంటే.. న‌లుపు ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుందని న‌మ్ముతారు. అయితే ఈ నల్లదారాన్ని పాదం పై భాగంలో, మెడ, నడుము లేదా మణికట్టు చుట్టూ కట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయ‌ట‌. కాని, ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈ నల్ల దారాన్ని స్టైలిష్ గా కనిపించేలా ధరిస్తున్నారు.

 

అయితే వాస్త‌వానికి  చిన్న‌త‌నం నుంచి నల్లదారాన్ని మొల‌తాడు పేరుతో నడుముకు లేదా కాలికి కట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల పొట్ట పెరగకుండా... నడుము పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడుంద‌ని అంటున్నారు. మ‌రియు  వెన్నునొప్పి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందన్న‌ది నిపుణుల మాట‌. ఇక‌ నడుముకు ఇది టైట్ గా అనిపించిందంటే మనం బరువు తగ్గాలి అని అర్థం చేసుకుంటార‌ట‌. 

 

అదేవిధంగా, కాళ్ళకు నల్లదారం ధ‌రించ‌డం వ‌ల్ల‌ జీవక్రియ సక్రమంగా జరిగేందుకు సహాయపడుతుంది. ఎందుకంటే శరీరంలోని ఏదైనా భాగాన్ని బిగించడం వల్ల మీ జీవక్రియ సక్రమంగా పని చేయడంలో మెరుగ్గా పని చేస్తుందట. మ‌రియు నల్లదారాన్ని ధరించడం వల్ల ఇది సంతాన ఉత్పత్తికి కూడా ఉప‌యోగ‌పడుతుందట. ఇది నడుముకు దగ్గరగా ఉండటం వల్ల పునరుత్పత్తి అవయవాలను చల్లగా ఉంచడానికి యూజ్ అవుతుంద‌ట‌. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: