కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం.. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడం మానవ సహజం. కానీ.. సంతోషాన్ని ఎలా ఎంజాయ్ చేసినా.. కష్టాన్ని మాత్రం దీటుగానే ఎదుర్కోవాలి. లేకపోతే జీవితంలో మరిన్ని కష్టాలకు ఆహ్వానం పలికిన వారం అవుతాము.

 

 

మనం అనుకున్నవి జరగనప్పుడు కలతపడటం, మనసు చిన్నబుచ్చుకోవడం ఎవరికైనా సహజమే. అయితే ఆధ్యాత్మికంగా పరిణతి సాధించిన వ్యక్తి ఇలాంటి ఆటుపోట్లకు పెద్దగా చలించడు. వీళ్లని కమ్మరి దాగలితో పోల్చవచ్చు.

 

 

కమ్మరి దాగలిని ఎప్పుడైనా చూశారా.. దానిపై ఎన్నో సమ్మెట పోట్లు పడుతుంటాయి. అయినా అది ఎలాంటి మార్పు చెందదు. అలాగే ఆధ్యాత్మికతలో ఉన్న వ్యక్తి కూడా. ఎన్ని కష్టనష్టాలనైనా నిబ్బరంగా భరిస్తాడు. పెట్టుకున్న లక్ష్యంపై నుంచి దృష్టిని మరల్చని, సాధించేవరకు విశ్రమించని లక్ష్య శుద్ధి కూడా ఇలాంటి కష్టాలను భరించే గుణం అందిస్తుంది.

 

 

మరో విషయం కష్టాలు ఎల్లకాలం ఉండిపోవు. ఈ విషయం తెలిసినా కొందరు కుంగిపోతుంటారు. కానీ రాబోయే ఆనందాలను అందుకునేందుకైనా మనం కష్టాలను ఎదురీది నిలవాలి. నిలిచి గెలవాలి.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: