కరోనా రక్కసికి వేలాది మంది మృతి చెందారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని పొట్టనబెట్టుకున్న కరోనా ప్రస్తుతం అతిపెద్ద విలయన్నే సృష్టిస్తోంది. అమెరికా కంటే ముందుగానే ఇటలీకరోనా దెబ్బకి విలవిలలాడిపోయింది. కానీ అదే దేశం నుంచీ తాజాగా ఓ 104 ఏళ్ళ వృద్దురాలు కరోనా తో పోరాటం చేసి దాదాపు చావు అంచుల వరకూ వెళ్లి వచ్చి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడ అందరూ ఆశ్చర్యపోయే మరొక విషయం ఏమిటంటే 1918 లో స్పానిష్ ఫ్లూ నుంచీ ఈ బామ్మ బయటపడిందట.

IHG's ready ...

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఈ బామ్మ గురించే చర్చ జరుగుతోంది. మాంచి వయసులో ఉన్న యువకులు సైతం కరోనా ధాటికి పిట్టల్లా రాలిపోతున్న సమయంలో 104 ఏళ్ళ బామ్మ  బ్రతికి బట్టకట్టడమే కాకుండా ఫొటోలకి ఫోజులు కూడా ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచీ బయటపడిన వృద్దులు అందరికంటే కూడా ఈ బామ్మ అందరికంటే అతిపెద్ద వయసు గల వృద్దురాలిగా రికార్డ్ కూడా క్రియేట్ చేసేసిందట.

IHG

మార్చి 17 వ తేదీన వాంతులు అవ్వడం, ఊపిరి ఆడకపోవడం, తీవ్రమైన దగ్గు జ్వరంలో ఆమెని నర్సింగ్ హోమ్ లో చేర్చారు. అప్పటికే ఎంతో మంది కరోనా రోగులు యువకులైన వారు కూడా మంచానికే పరిమితమై పోతుంటే జనుస్సో అనే ఈ బామ్మ  మంచం నుంచీ తన వీల్ చైర్ వరకూ నడుచుకుంటూ వెళ్లి కూర్చునేదట.

దాంతో ఆ హాస్పటల్ డాక్టర్ ఆ బామ్మ అతి త్వరగా అందరికంటే వేగంగా కోలుకోవడం చూసి షాక్ తిన్నడట. ఎట్టకేలకి కరోనాకే షాక్ ఇచ్చిన సదరు బామ్మ ఇప్పుడు హాయిగా తన ఇంటికి వెళ్ళిపోయిందని అంటున్నారు స్థానిక వైద్యులు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: