పాజిటివ్.. ఇప్పుడు ఈ మాట వింటేనే చాలా మంది వెన్నులో వణుకు పుడుతోంది. కరోనా పాజిటివ్ తో వచ్చిన సమస్య ఇది. అవును.. కరోనా పాజిటివ్ వస్తే జీవితం అల్లకల్లోలమే.. కోలుకునే అవకాశాలు ఉన్నా.. కరోనా మన వల్ల మిగిలిన వారికీ అంటుకుంటుంది.

 

 

అయితే కరోనా పాజిటివ్ ఎంత డేంజరో.. నిజ జీవితంలో నెగిటివ్ దృక్పథం కూడా అంతే డేంజర్.. అసలే ఇది కష్టకాలం.. ఇలాంటి సమయంలో నెగిటివ్ ఆలోచనలు అస్సలు రానీయకూడదు. ఉద్యోగం ఉంటుందా.. పోతుందా.. ఆదాయం వస్తుందా.. పోతుందా.. వ్యాపారంలో నష్టాలు పెరిగిపోతాయా.. ఇలాంటి ఆలోచనలు ఈ సమయంలో సహజమే.

 

 

ఇలాంటి ప్రతి ఆలోచనకూ రెండు ఆలోచనలుంటాయి. ఏమీ కాదులే అన్న ధీమా ఆశ కల్పిస్తుంది.. ఏదో ఒకటి చేద్దాములే అన్న ధైర్యం ముందుకు నడిపిస్తుంది. ప్రత్యామ్నాయం గురించి ఆలోచింపజేస్తుంది.. అలా ఒక అడుగు ముందుకు పడుతుంది.

 

 

అదే నెగిటివ్ గా ఆలోచిస్తే.. ఇక ముందు ఏమీ లేదు.. అంతా అయిపోయింది. ఇక ఇప్పుడు చేసేదేమీ లేదు.. వంటి ఆలోచనలతో మనసును శూన్యం ఆవరిస్తుంది. నిస్తేజం పురివిప్పుతుంది. అప్పుడు వచ్చే ఒకటి, రెండు మంచి ఆలోచనలు కూడా రావు. ఈ ఆలోచనతో అంతా అనర్థమే. అందుకే కరోనా కష్ట కాలంలో పాజిటివ్ గానే ఉండండి. కష్టాలు ఎల్లకాలమూ ఉండవని గుర్తుంచుకోండి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: