ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌పంచ‌దేశాల‌ను అల్ల‌క‌ల్లోలం చేస్తోంది. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు మ‌రియు మ‌ర‌ణాలు పెరుగుతూనే ఉన్నాయి.  ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కరోనా కోరలు చాచింది. అయితే క‌రోనాకు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. అంద‌రూ నివార‌ణ‌పైనే దృష్టి సారించారు. ఈ క్ర‌మంలోనే దేశ‌దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్ర‌జ‌లు ఇంటికే ప‌రిమితం అయ్యారు.

 

ఇక చాలా మంది లాక్‌డౌన్ వ‌ల్ల ఇంట్లో ఏం చేయాలో తెలియ‌క నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక‌వేళ ధైర్యం చేసి బ‌య‌ట‌కు వ‌స్తే.. పోలీసులు కుమ్మేస్తున్నారు. అయితే ఇలాంటి వారు కొన్ని టిప్స్ ఫాలో అయితే రోజంతా హ్యాపీగా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా అవసరం. అందుకు లాక్‌డౌన్ స‌మ‌యాన్ని చ‌క్క‌గా ఉప‌యోగించ‌వ‌చ్చు ఇక  యూట్యూబ్‌లో వ్యాయామ తరగతులు చాలానే ఉన్నాయి.

 

అలాగే వంట‌లు చేయ‌డం.. కొత్త కొత్త రెసిపీస్ నేర్చుకుని కుటుంబ స‌భ్య‌ల‌కు రుచి చూపిండం వ‌ల్ల కూడా లాక్‌డౌన్ స‌మ‌యాన్ని సులువుగా గ‌డిపేయ‌వ‌చ్చు. ఇక పుస్తకాలు ఎంతో విజ్ఞానాన్ని పంచడమే కాదు వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి. కనుక ఎవరి ఆసక్తినిబట్టి వాళ్లు మంచి పుస్తకాలను చదవడం అలవర్చుకోవడం ఉత్తమం. మ‌రియు ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇత‌ర భాష‌ల‌ను నేర్చుకోవ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: