కరోనా కారణంగా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. నిత్యావసరాలకు బయటి వారి పై ఆధారపడుతున్న జనం లాక్ డౌన్ కారణం గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమస్యల్లో సెలూన్ సమస్య ఒకటి . గడ్డం లేదా క్రాఫ్ పెరిగితే ఉన్నపలంగా సెలూన్ షాప్ కి వెళ్లి షేవింగ్ మరియు కటింగ్ చేయించుకునే వాళ్ళం కానీ లాక్ డౌన్ వచ్చిన తరువాత ప్రజలు విపరీతంగా గడ్డలు, జుట్టు పెంచుకొని బబాజిల్లా మారుతున్నారు .కొందరు మాత్రం ట్రిమ్మర్ లతో ప్రయోగాలు చేస్తున్నారు . మరికొందరు సాహసించి చిన్నపిల్లలకు క్రాఫింగ్ చేస్తున్నారు. ఎవరన్నా క్రాఫింగ్ ను చూసి కటింగ్ గురించి అడిగితే ఇది కరోనా కట్టింగ్ అని తమాషాగా బదులు చెబుతున్నారు.

 

అలవాటు లేనివాళ్లు ట్రిమ్మర్లతో హెయిర్ కటింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరు ఇంట్లో ఉన్న తమ భార్యలను బ్రతిమిలాడి మరీ కటింగ్ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గృహిణీలు ఆ రిక్వెస్ట్ లు తీసివేయలేక తమ భర్తలకు కటింగ్ చేసే పనిలో పడ్డారు. ఊహించండి జనాలు లాక్ డౌన్ కారణంగా ఇళ్లలో గడ్డం ,జుట్లు పెంచి బయటకి రావడానికి ఎంత మొహమాటం పడుతున్నారో. ఇళ్లలో ఎప్పుడు ఫెయిర్ గా ఉండే మగవాళ్ళు అద్దాలలో తమ మొహాలను చూసుకొని తమనుతాము నమ్మలేక పోతున్నారంట.

 

కొంత మంది జుట్టు పై ప్రయోగాలు చేస్తుంటే చేతకాని వాళ్ళు గడ్డలు మరియు జుట్టు పెంచి స్వామిజీ లు లాగా కనిపిస్తున్నారు.ఓ పక్క క్షవరకులు చేతిలో పనిలేక ఇల్లు గడవక ఇబ్బంది బడుతున్నారు. ఏప్రిల్ 14 న లాక్ డౌన్ ఫ్రీ చేస్తారని అంత భావించారు కానీ మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించడంతో క్షవరకులు ఆందోళనలో ఉన్నారు.ఏదేమైనప్పటికీ కరోనా కట్టడికి మద్దతుగా ఇంట్లోనే ఉండి తమనుతాము రక్షించుకోమని ప్రభుత్వం చూచిస్తోంది. ఇంట్లోనే ఉంది మనము మరియు  మనతోటి వారిని కాపాడుకొందాం 

మరింత సమాచారం తెలుసుకోండి: