లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఆన్ లైన్ సేవలు మూతపడ్డాయి. మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. దేశ ఆర్ధిక వ్యవస్థ గాడిన పెట్టేదిశగా మరియు ఎకానమీ ని కొంతమేర  పెంచేదిశగా కేంద్రం కొన్ని వ్యాపార సంస్థలకు సడలింపులు ఇచ్చింది . ఇందులో భాగంగానే ఆన్ లైన్  ఫుడ్ సేవలకు గాను కొన్ని షరతులతో కూడిన అనుమతులు  ఇచ్చింది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ కస్టమర్లకు ఓ తీపికబురు చెప్పించి. అదేమిటంటే జొమాటో డెలివరీ బాయ్స్ యొక్క బాడీ టెంపరేచర్ డిటెక్టర్ని కొత్తగా తమ యాప్ లో చేర్చారు.

 

అంటే కరోనా కారణంగా శరీర ఉష్ణోగ్రత లో వచ్చే మార్పులు ఈ జొమాటో యాప్ ద్వారా  గుర్తించవచ్చన్నమాట. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్త కి కొంతమంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అదేంటంటే కరోనా వచ్చిన వ్యక్తి తన టెంపరేచర్ తక్కువగా చుపిచుకొనే ప్రయత్నంలో పారాసెటమాల్ వినియోగిస్తే ఆ యాప్ గుర్తిలుస్తుందా అని సెటైర్స్ వేస్తున్నారు. మరి అదికూడా నిజమేగా ...ఒకవేళ డెలివరీ బాయ్ పారాసెటమాల్ వినియోగించి సర్వీస్ ఇస్తే...ఆర్డర్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి ? ...కావున తస్మాత్ జాగర్త ఆన్ లైన్ ఆర్డర్స్ ఇచ్చేముందు తెలివిగా ఉండండి ...కోరి కరొనను ఇంట్లోకి ఆహ్వానించోదు అని కొంతమంది హితోపదేశం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: