భారత దేశానికి సంబంధించి తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా మార్క్స్‌ పేర్కొన్న 1857 తిరుగుబాటు దేశ చరిత్రలో కీలకమైంది. అప్పటి వరకు మొగలాయిపాలనను బలహీన పరుస్తూ ఒక్కొక్క ప్రాంతాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకుంటున్న బ్రిటీిష్‌ సామ్రాజ్య వాదులకు చెందిన ఈస్టిండియా కంపెనీని ఒక కుదుపు కుదిపిన సంఘటన అది. బుద్దుని కాలం నుంచి శాంతి, సహనశీలతకు పేరుగాంచిన భరతభూమిలో స్థానిక జనం కోపాన్ని, కసిని చవిచూసిన క్షణమది. స్వార్ధ రహిత అమరవీరుల రక్తం తో భారత దేశపు కలోనియల్ చరిత్ర ముడి పడి ఉంది.

 

1857 లో భారత మరాఠా నాయకుడు తాత్యా తోపే గా ప్రసిద్ది చెందిన రామచంద్ర పాండురంగ తోపే ధైర్యవంతుడైన స్వాతంత్ర్య సమర యోధుడు.  తన తండ్రికి అర్హత ప్రకారం రావలసిన పింఛను అందని కారణంగా కలోనియల్ పాలకులకు విరుద్ధంగా తాత్యా తోపే పోరాడారు. తనకి ఎదురైనా దేబ్బలను నాయకుడిగా ఎదుర్కొని గ్వాలియర్ ని తిరిగి స్వాధీన పరచుకోవడానికి తాత్యా ముఖ్య పాత్ర పోషించారు. భారత స్వాతంత్ర సమరం లో తన ప్రాణాన్ని విడిచారు. 

 

కాన్‌పూర్‌ను ఆంగ్లేయుల నుండి హస్తగతం చెసుకున్న తర్వత ఝాన్‌సీ రాణి లక్ష్మీభాయితో చేతులు కలిపేరు.  తాత్యా తోపేకి నమ్మకస్తుడైన స్నేహితుడు నర్వార్ మాన్ సింగ్ అనే రాజు తోపే కి నమ్మకద్రోహం చేసాడు. దాని ఫలితంగా, తోపే కి శివపురి లో ఏప్రిల్ 18, 1859 న మరణశిక్ష విధించారు. ధైర్యవంతుడైన సైనికుడిగా యోలా మరియు శివపురి లో ఉన్న స్మారక చిహ్నాల ద్వారా తాత్యా తోపే చిరకాలం గుర్తుండి పోతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: