మన జీవిత గమనాన్ని నిర్ణయించేవి ఆలోచనలే.. మన ఆలోచనలే మన మార్గదర్శకాలు. మన ఆలోచనలే మన భవిష్యత్ ను నిర్దేశించేవి. అందుకే ఆలోచనల పట్ల ఓ ఆలోచన ఉండాలి. నిమిషానికి మన మనస్సు కోట్ల ఆలోచనలు చేయగల సత్తా ఉంది. ఆ ఆలోచనల గమనాన్ని మనం మార్చగలిగితే.. మన భవిష్యత్‌ను మార్చుకున్నట్టే..

 

 

ఉదాహరణకు.. ఎప్పుడూ మనవైపు నుంచే ఆలోచిస్తాం. ఇది చాలా సహజం. మానవ నైజం కూడా.. కానీ.. ఎదుటి వారి వైపు నుంచీ ఆలోచించగలిగితే అది సదవగాహనకు దారి తీస్తుంది. మన తోటి వారితో మన ప్రవర్తన సవ్యంగా సాగుతుంది. సమాజంపై మన అవగాహన పెరుగుతుంది.

 

 

అందుకే ముందు మనలో సానుకూల ధోరణిని పెంచుకోవాలి. ప్రతికూల భావాలను వదిలేయాలి. ఎవరైనా ఏది చెప్పినా దాన్ని మంచిగా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. ఇలా ఆచరించడం సానుకూల ధోరణి.

 

 

కొన్నిసార్లు.. ఇతరులు మంచి చెప్పినా మనం గుడ్డిగా తిరస్కరిస్తుంటారు. వ్యతిరేకంగా వాదిస్తుంటాం.. చేయాల్సిన పనిని వాయిదా వేస్తుంటాం. కొన్నిసార్లు ఇది మనకు తెలియకుండానే చేస్తుంటాం. దీనికి కారణం మన ఆలోచనల్లోని ప్రతికూల ధోరణి. అదే సానుకూల ధోరణి పెంచుకుంటే ఇలా చేసే అవకాశాలు చాలా తక్కువ. అందుకే మన ఆలోచనలే మన పెట్టుబడి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: