దేశంలో ఇప్పుడు కరోనా ఏ రేంజ్ లో విస్తరిస్తుందో అందరికీ తెలిసిందే.  ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో కూడా ఇబ్బందులు సృష్టిస్తుంది. కాకపోతే ఇతర దేశాలతో పోల్చితే.. మన ఆహారపు అలవాట్లు కొద్దిమేర కరోనాని కట్టడి చేస్తుందని అంటున్నారు. కరోనాని కట్టడి చేయడానికి గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో కరోనా పూర్తి స్థాయిలో కట్టడి కాలేదని.. లాక్ డౌన్ వచ్చే నెల 3 వరకు పెంచారు.  

 

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇప్పుడు మనం వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలని.. కరోనాకు బ్రేక్ వేసేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా అన్నదానిపై అందరూ దృష్టి సారిస్తున్నారని అన్నారు.  తాను తాను కధా పానియం తాగుతానని ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అన్నారు. కధా అనేది ఆయుర్వేద మూలికలతో తయారయ్యే టీ లాంటి ఔషధం లేదా పానీయం. 


దీనికి కవాల్సిన పదార్థాలు :

తులసి ఆకులు, యాలకులు, దాల్చిన చెక్క, శొంఠి, నల్ల మిరియాలు- టేబుల్‌ స్పూన్‌ చొప్పున, ఎండుద్రాక్షలు- పది, నీళ్లు- మూడు కప్పులు, నిమ్మరసం


తయారు చేసుకునే విధానం :

నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, శొంఠి, యాలకులను మెత్తగా పొడి చేసుకోవాలి. గిన్నెలో నీళ్లు పోసి వేడెక్కాక సిద్ధం చేసుకున్న పొడి వేసి కలపాలి. తర్వాత తులసి ఆకులు, ఎండుద్రాక్షలు కూడా వేసి అయిదు నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించాలి. బాగా మరిగిన తర్వాత దాని రంగు ముదురుగా మారిపోతుంది.. మంచి సుగంద పరిమళం కూడా వస్తుంది.  

 

రుచి కోసం బెల్లం, తెనె కలిపితే బాగుంటుంది.  ఈ పానీయం వల్ల  ఇన్ఫెక్షన్లు రావు... జీర్ణక్రియ మెరుగవుతుంది... బాడీలో విష వ్యర్థాలు బయటకు పోతాయి. కరోనా వైరస్ లాంటి అలర్జీ సీజన్‌లో దీన్ని తాగితే ఎంతో మేలు జరుగుతుంది.  మరి ఆలస్యం ఎందుకు మన ఇంట్లో ఈ పానియం తయారు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: