ప్రతి మనిషిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. అలాగే కొన్ని బలాలు ఉంటాయి. తన బలంపై నమ్మకం ఉండాలి.. తన బలహీనతలపై అవగాహన ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు జీవితం సులభం అవుతుంది. జీవించడం ఆనందం అవుతుంది. మన బలాలు బలహీనతలతో పాటు సమయస్ఫూర్తి కూడా ఉండాలి.

 

 

మన అలవాట్లు, మన మనస్తత్వం ఎలా ఉన్నా.. పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే.. జీవితంలో నెగ్గుకురావడం చాలా కష్టం. పరిస్థితి అంటే ప్రదేశం, సమయం వంటి పరిసరాల స్థితి. మీరు ఆస్తిపరులే కావచ్చు.. కానీ ఒక్కోసారి ఐదు రూపాయల కోసం కూడా చేయి చాచాల్సిన దుస్థితి రావచ్చు.

 

 

మీరు మహా బలవంతులే కావచ్చు.. ఒక్కోసారి అడుగు తీసి అడుగు వేయడానికి కూడా మరొకరి సహాయం తీసుకోవాల్సి రావచ్చు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనోనిబ్బరం కోల్పోకూడని తత్వం అలవర్చుకోవాలి. నేనింతే.. నేనిలాగే ఉంటా.. నాకు ఇలాగే అలవాటు. ఇది నా వల్ల కాదు.. ఇలాంటి పదాలు తరచూ మీ నోటి నుంచి వస్తే.. ఒకసారి ఆలోచించుకోవాల్సిందే.

 

 

వసుదేవుడు అర్ధరాత్రి సమయంలో చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణుణ్ని రేపల్లెకు చేర్చే సమయంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరకు గాడిద కాళ్లు కూడా పట్టుకున్నాడు. ఆయన కృషికి దైవబలం తోడయ్యింది. యమునానది దారిచ్చింది. వర్షంలో ఆదిశేషుడు పడగనే గొడుగుగా పట్టాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: