1917 అక్టోబర్‌ మహా విప్లవం విజయ వంతమై బోల్షివిక్కులు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక దేశంలో సోషలిజం సాధ్యమే నని, అందుకోసం ప్రయత్నిద్దామని లెనిన్‌ ప్రతిపాదించాడు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో నిర్ధిష్టంగా అమలుచేయడం ఎలాగో కార్మిక వర్గానికి బోధించాడు లెనిన్‌.  అందుకే మార్క్స్‌- ఏంగెల్స్‌ తరువాత మార్క్సిస్టు మహామహోపాధ్యా యునిగా చరిత్రలో చిరస్థాయి స్థానం సంపాదిం చుకున్నాడాయన. మార్క్సిజం అనే శాస్త్రీయ సిద్ధాంతాన్ని మరో మెట్టు పైకి తీసుకుపోయి దాన్ని ఒక కళగా మార్చాడు లెనిన్‌.

 

అందుకే లెనిన్‌ తరువాత మార్క్స్‌-ఏంగెల్స్‌ సిద్ధాంతం మార్క్సిజంగా కాక మార్క్సిజం-లెనినిజంగా మారింది.మా సిద్ధాంతం పిడివాదం కాదు, అది ఆచరణకు కరదీపిక'' అన్నారు మార్క్స్‌- ఎంగెల్స్‌. సిద్ధాంతానికీ, ఆచరణకూ మధ్య ఉన్న గతితార్కిక సంబంధాన్ని ఆచరణలో చూపిం చడం ద్వారా అక్టోబర్‌ విప్లవం సాధించాడు లెనిన్‌.  లెనిన్‌ అసలు పేరు వ్లదిమీర్‌ వొలోద్యా ఇల్యిచ్‌. 1870 ఏప్రిల్‌ 10న జన్మించాడు. తండ్రి మధ్యతరగతి ఉద్యోగి. చిన్న తనం నుండి లెనిన్‌ చదువులో ముందుండే వాడు. చదరంగం ఆటగాడు. క్రమశిక్షణతో మెలిగేవాడు. 1886లో లెనిన్‌ 16వ ఏట తండ్రి చనిపోయాడు. అదే ఏడాది సెంట్‌ పీటర్స్‌ బర్గ్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆయన అన్న అలెగ్జాండర్‌ను ఉరి తీశారు.

 

అప్పట్లో  జారు చక్రవర్తి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అలెగ్జాండర్ పోరాటం చేసేవారు అందుకే ఆయన్ని దేశ ద్రోహిగా చిత్రీకరించి ఉరి తీశారు. ‘మార్క్సిజాన్ని సిద్ధాంతం నుండి ఆచరణకు, సైన్సు నుండి కళకు అభివృద్ధి చేయడం ద్వారా లెనిన్‌ ఈ రెంటి మధ్య ఉన్న గతితార్కిక సంబంధాన్ని అంటే రెంటి మధ్య ఉమ్మడిగా ఉన్నదేమిటి, రెంటి మద్య తేడా ఏమిటి అన్నదాన్ని చూపించాడు’ అని టోనీ క్లిఫ్‌ పేర్కొన్నాడు. రష్యాలో అక్టోబర్‌ విప్లవం జయప్రదం చేయడంలో లెనిన్‌ అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలను పరిశీలిస్తే ఈ విషయం మనకు తేటతెల్లమవుతుంది.

 

లెనిన్‌ మార్గదర్శకత్వంలో అందులో కూడా బోల్షివిక్కులు విజయం సాధించారు. ఆ విధంగా మార్క్సిజాన్ని నిర్దిష్ట పరిస్థి తులకు అన్వయించడంలో లెనిన్‌ చూపించిన ప్రతిభ అక్టోబర్‌ విప్లవం అంతటా మనకు కనిపిస్తుంది. విప్లవంలోని ప్రతి మలుపునూ ఆయన నిర్దిష్టంగా విశ్లేషించి దానికి తగ్గ వ్యూ హాన్నీ, ఎత్తుగడలనూ అనుసరించాడు. నిజానికి లెనిన్‌ లేనిదే అక్టోబర్‌ విప్లవం లేదు. అక్టోబర్‌ విప్లవం లేనిదే లెనిన్‌ లేడు. అక్టోబర్‌ విప్లవ శతవార్షికోత్సవాల సందర్భంగా ఆ మార్క్సిస్టు- లెనినిస్టు మహోపాధ్యాయుని జీవితం కృషిని గురించి అధ్యయనం చేయడం అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: