క‌రోనా వైర‌స్.. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌పంచ‌దేశాల‌ను చుట్టుముట్టేసింది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి.  గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 30లక్షలు దాటాయి. మ‌రియు క‌రోనా కాటుకు రెండు ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌జ‌లు బ‌లైపోయారు. ఇంకా ఎంతమందిని ఈ మ‌హ‌మ్మారి బ‌లితీసుకుంటుందో తెలియదు. మన దేశంలోనూ కరోనా వైరస్ పంజా విసిరింది. దేశవ్యాప్తంగా 30వేల కరోనా కేసులు నమోదయ్యాయి.

IHG

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా అదుపులోకి రావ‌డం లేదు. కరోనాకు రోజురోజుకు విజృంభిస్తున్న వేళ.. దీనికి సంబంధించిన అప్ డేట్స్ తెలుసుకునేందుకు ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ నేపధ్యంలో కరోనా గురించి ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఓ విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. క‌రోనా పేరు కేవ‌లం వైర‌స్ మాత్ర‌మే కాదు.. ఓ అంద‌మైన న‌గ‌రం కూడా ఉంద‌ట‌. కరోనా అనే కీవర్డ్ గూగుల్ లో సెర్చ్ చెయ్యగానే.. సెర్చ్ రిజల్ట్స్ లో కరోనా వైరస్ తో పాటు కరోనా సిటీ కూడా రావ‌డంతో చాలా మంది ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నార‌ట‌. 

IHG

కరోనా నగరం కాలిఫోర్నియాలో ఉన్న ఒక అందమైన నగరం. ఒక ల‌క్షా యాబై వేలు కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ నగరం లాస్ ఏంజిల్స్ కు 45 కిలో మీటర్ల దూరంలో ఉంది. కాలిఫోర్నియాలోని ఈ కరోనా న‌గ‌రం సంవత్సరంలో ఏ టైమ్‌లోనైనా సందర్శించదగ్గ అద్భుతమైన గమ్యస్థానాల్లో ఒకటి. ఈ క‌రోనా నగరంలో  ప్రఖ్యాత డే స్పా, మ్యూజిక్ మ్యూజియం, గో కార్ట్ రేస్, జిప్లింగ్ వంటి అనేక పర్యాటక ఆకర్షణలతో కరోనా టూరిస్టులను ఎంతో ఆక‌ర్షిస్తాయి. మ‌రియు ఇక్క‌డ‌ దాదాపు వందల ఎకరాల్లో ఉద్యానవనాలు ఉన్నాయి. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. క‌రోనా వైర‌స్ ఎంత ప్రాణాంత‌క‌ర‌మైన‌దో.. ఈ క‌రోనా న‌గ‌రం అంత ఆనందకరమైనది. 

మరింత సమాచారం తెలుసుకోండి: