ఈ భూమిపై పుట్టిన ప్రతీ జీవి తన కంటూ ఓ ప్రత్యేకత కలిగి ఉంటుంది. కొన్ని కొన్ని జీవులైతే ఊహలకి అందని విధంగా భిన్నమైన అలవాట్లు కలిగి ఉంటాయి. ఊసరవెల్లి నుంచీ గాలిలో ఎగిరే పాము, విషపూరితమైన కప్ప, రంగులు మార్చే పక్షి, గొంతులు మార్చే కోతులు ఇలా ప్రతీ జీవికి ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉంటాయి. కానీ సైబీరియా ప్రాంతాలలో అత్యధికంగా కనిపించే ఓ పక్షి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాని ప్రత్యేకత తెలుసుకున్న వాళ్ళు ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరి దాని ప్రత్యేకత ఏమిటో ఓ లుక్కేద్దాం..

IHG

ఉత్తర చైనా , ఆగ్నేయ సైబీరియాని ఆవాసాలుగా చేసుకుని ఉంటున్న ఫాల్కన్ అనే జాతికి చెందిన అమూర్ ఫాల్కన్ అనే ఈ చిన్న పక్షి గురించి పెద్దగానే చెప్పుకోవాలి. ఇది చూడటానికి చిన్నగానే ఉంటుంది కానీ అవలీలగా దేశ దేశాల సరిహద్దులని దాటేస్తూ సముద్రాలని దాటుకుంటూ సుధీర్గమైన ప్రయాణాన్ని అలుపు లేకుండా చేసేస్తుంది. దాని ప్రయాణం ఎలా మొదలవుతుందో తెలుసా..చైనా నుంచీ మంగోలియా వెళ్తుంది. అక్కడి నుంచీ అరేబియా మహా సముద్రం మీదుగా ఆఫ్రికా వెళ్తుంది. ఆక్కడి నుంచీ..

IHG

మంగోలియా మీదుగా సోమాలియా అక్కడి నుంచీ హిమాలయాల మీదుగా భారత్ లోని నాగలాండ్ రాష్ట్రానికి వలస వెళ్తుంది కొంత కాలం నాగాలాండ్ లో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అయితే ఒక్క సారి ఈ పక్షి ప్రయాణం మొదలు పెడితే ఆగకుండా 22 వేల కోలోమీటర్లు వరకూ వెళ్తుందట. చిన్నగా ఉండే ఈ పక్షి చేసే ప్రయాణం శాత్రవేత్తలని ఎంతో ఆశ్చర్యపరించిందట. అయితే 2012 వరకూ ఈ పక్షులని వేటాడేవారు. క్రమ క్రమంగా ఈ జాతి అంతరించి పోతున్న సమయంలో ప్రభుత్వం కొన్ని ఎన్జీవోలు సాయంతో ఈ పక్షి జాతి సంరక్షణ చేపట్టారు. ఈ పక్షి పేరుతో నాగాలాండ్ లో ప్రతీ ఏటా అమూర్ ఫాల్కన్ వేడుకలు కూడా జరుగుతాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: