శృంగార‌మ‌నేది ఎంజాయ్ చేయ‌డానికి ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. ప్ర‌తొ ఒక్క‌రూ ఒక్కోసారి ఒక్కోటి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడూ ఒకే మూడ్‌లో ఉండ‌రు. దాంతో కొన్ని సార్లు ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. ఒక్కోసారి భ‌ర్త‌కు మూడ్ ఉంటే భార్య‌కు ఉండ‌దు. అలాంట‌ప్పుడు శృంగారం చేయ‌మ‌ని ఇబ్బంది పెట్ట‌కూడ‌దు. అలా చేయ‌డం వ‌ల్ల వారు ఏదో ఇబ్బంది ప‌డుతూ ఒళ్ళు అప్ప‌గించాస్తారు త‌ప్పించి శృంగారాన్ని ఎంజాయ్ చేయ‌లేరు. ఇక శ‌రీరం త‌న ప‌ని తాను చేసుకుంటూపోతుంది. మ‌న‌సు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. శృంగారంలో ఇద్ద‌రూ ఎంజాయ్ చేయాలంటే ముందుగా చేయాల్సింది ఏమిటంటే మైండ్‌ని ఫ్రెష్‌గా ఉంచుకోవాలి. ఏవేవో ఒత్తిడుల‌న్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే మైండ్ ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండ‌దు.  దాంతో శృంగారం మీద‌కి మ‌న‌సు పోదు.

 

ఇత‌ర విష‌యాలు ఏవీ కూడా ఆలోచించ‌కుండా కేవ‌లం త‌మ పార్ట‌న‌ర్‌తో ప్రేమ‌గా ఒక‌వేళ వాళ్ళ‌కి మూడ్‌రాక‌పోతే మూడ్‌లోకి ఎలా దించాల‌ని ఆలోచించాలి కాని అన‌వ‌స‌ర‌మైన విష‌యాల‌న్నీ ఆలోచిస్తూ ఉండ‌క‌డ‌దు. దాని వ‌ల్ల ఇద్ద‌రికీ న‌ష్టం. అలాగే ఆడ‌వాళ్ళు ఎక్కువ‌గా శృంగారం చేసేట‌ప్పుడు నేను న‌చ్చానా లేదా.. నేను త‌నికి అన్ని విధాలా స‌రిపోయానా అలాగే నా శ‌రీరం నుండి ఏమైనా దుర్వాస‌న వ‌స్తుందా అని ఎక్కువ‌గా ఆలోచిస్తారంట‌. ఇక సెక్స్ బాగా ఎంజాయ్ చేసే స‌మ‌యంలో మాములుగా అయితే బ్రెయిన్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇక శృంగారం మైండ్ బ్లోయింగ్‌గా ఉన్న‌ప్పుడు మ‌న‌సులో వేరే ఏ ఆలోచ‌న రాద‌ట‌. 

 

ఇక సెక్స్‌లో పాల్గొనే స‌మ‌యంలో వేరు వేరు విష‌యాల‌నుఎక్కువ‌గా ఆడ‌వారు ఆలోచిస్తూ ఉంటార‌ట‌. అలాగే మ‌రికొంత మంది ఆడ‌వారు సెక్స్‌లో పాల్గొనే స‌మ‌యంలో భ‌ర్త‌, బాయ్‌ఫ్రెండ్ కంటే ఏద‌న్నా వైబ్రేట‌ర్ అయితే బావుండేది అనిపిస్తుంద‌ట‌. అలాగే శృంగారంలో పాల్గొనే ముందు చాలా మంది ఆడ‌వారు ఉద‌యం లేవ‌గానే ఏమి వండాలి. రేపు ఆఫీస్‌కి ఏమి డ్ర‌స్ వేసుకెళ్ళాలి. త‌నను డ‌బ్బులు అడుగుదామా లాంటి ఆలోచ‌న‌లు కూడా ఎక్కువ‌గా చేస్తుంటార‌ట‌. ఇలాంటి వ‌న్నీ మ‌న‌సులో ఉండ‌డం వ‌ల్ల ఎక్కువ‌గా శృంగారాన్ని ఎంజాయ్ చెయ్య‌లేరు. ఎంత పీస్ ఆఫ్ మైండ్‌తో ఉంటే అంత మంచిద‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: