ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌.. అన్ని దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. ఈ మ‌హ‌మ్మారికి అంతం ఎక్క‌డో తెలియ‌క ప్ర‌భుత్వాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 39 లక్షలకు చేరువలో కేసులు ఉండగా కోవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2.60 ల‌క్ష‌లు మించిపోయింది. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. అయిన‌ప్ప‌టికీ కరోనాపై అన్ని వైపుల నుంచి యుద్ధం చేస్తున్నామని, ఎలాగైనా వైరస్‌పై విజయం సాధిస్తామని దేశ‌దేశాలు న‌మ్మ‌కంతో ఉన్నాయి.

 

అయితే క‌రోనాను మ‌ట్టుపెట్టాలంటే భౌతిక దూరం పాటించ‌డం, వ్య‌క్తిగ‌త శుభ్ర‌త చాలా అవ‌స‌రమ‌ని ప‌దే ప‌దే చెబుతుండ‌డంతో.. చాలా మంది కరోనా వైరస్ చనిపోవాలనే ఉద్దేశంతో వీలైనన్ని ఎక్కువసార్లు చేతుల్ని సబ్బుతో 20 సెకండ్లపాటు కడేగేసుకుంటున్నారు. అయితే అతి చేయ‌డం వ‌ల్ల అనేక రోగాలను తెచ్చిపెడుతుంది. అది చేతుల్ని క‌డుక్కోవ‌డానికి కూడా మిన‌హాయింపు కాదు. సబ్బైనా, శానిటైజరైనా ఎక్కువ వాడటం ప్రమాదమే అంటున్నారు. అలా చేస్తే కరోనా సంగతెలా ఉన్నా.. ఇతర అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులూ వస్తాంటున్నారు నిపుణులు. ముఖ్యంగా శానిటైజర్లను అతిగా వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయంటున్నారు. 

 

అలాగే ఎక్కువసార్లు సబ్బు లేదా శానిటైజర్‌తో చేతుల్ని శుభ్రం చేసుకుంటే..  చర్మపు పై పొర దెబ్బతింటుంది. క్రిములతో పాటూ చర్మంపై ఉండే నేచురల్ ఆయిల్స్ కూడా పోతాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మాయిశ్చరైజింగ్ ఎక్కువగా ఉండే సబ్బుల్ని యూజ్ చేయ‌డం ఉత్త‌మం. అదేవిధంగా చేతుల్ని కడుక్కున్న తర్వాత మాయిశ్చరైజర్ క్రీమ్ రాసుకుంటే ఉత్త‌మం.  మ‌రియు ఆలివ్ ఆయిల్‌తో ఎప్ప‌టిక‌ప్పుడు చేతుల‌ను మ‌సాజ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇక బాదం నూనెలో తేనె కలిపి చేతులపై నెమ్మదిగా మసాజ్ చెయ్యాలి. ఇవి స్కిన్‌ లోపలికి వెళ్లి చ‌ర్మాన్ని కాపాడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: